Netflix : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. జూన్ 2 నుంచి ఆ డివైజ్‌లలో సర్వీసులు బంద్

Netflix : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు ఓ బ్యాడ్ న్యూస్. పాత అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌లను (Amazon Fire TV Stick) ఉపయోగిస్తున్న వారికి నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్ ఆపేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. జూన్ 2, 2025 నుంచి మొదటి తరం ఫైర్ టీవీ డివైజ్‌లలో (First-generation Fire TV devices) నెట్‌ఫ్లిక్స్ పనిచేయడం ఆగిపోనుంది.
ఎందుకు ఈ నిర్ణయం?
అధునాతన వీడియో ఫార్మాట్లలో (Advanced Video Formats) వస్తున్న మార్పుల వల్ల నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కంపెనీ ప్రస్తుతం AV1 అనే కొత్త వీడియో కోడెక్‌ను అమలు చేస్తోంది. ఇది తక్కువ డేటాను ఉపయోగిస్తూనే మెరుగైన వీడియో క్వాలిటీని అందిస్తుంది. దురదృష్టవశాత్తు మొదటి తరం ఫైర్ టీవీ డివైజ్‌లు ఈ AV1 కోడెక్‌కు సపోర్ట్ చేయవు. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఈ పాత డివైజ్‌లలో తమ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
Read Also:Summer Skincare : వేసవిలో నల్లగా మారిన చేతులు మిలమిలా మెరవాలా.. ఈ 5 చిట్కాలు పాటించండి
ఎవరిపై ప్రభావం పడుతుంది?
నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యంగా కింది డివైజ్‌లను ఉపయోగించే వినియోగదారులపై ప్రభావం చూపుతుంది
అమెజాన్ ఫైర్ టీవీ (2014)
అలెగ్జా వాయిస్ రిమోట్ (2016)తో కూడిన ఫైర్ టీవీ స్టిక్
ఫైర్ టీవీ స్టిక్ (2014)
ఈ డివైజ్‌లన్నీ పాతవి ప్రస్తుత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల అవసరాలను తీర్చలేవు. వాస్తవానికి అమెజాన్ కూడా చాలా సంవత్సరాల క్రితమే ఈ మోడల్స్‌కు సాఫ్ట్‌వేర్,సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను నిలిపివేసింది. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు.
Read Also:Karnataka : నాకో లవర్ ఉన్నాడు.. మండపంలో ధైర్యంగా వధువు చేసిన పని వైరల్.. వీడియో
ఇకపై ఏం చేయాలి?
నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. కానీ ఇది వాస్తవానికి మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన సమయం అని సూచిస్తుంది. కొత్త టెక్నాలజీతో ఫాస్ట్ స్ట్రీమింగ్, మెరుగైన ఫీచర్ల అనుభవాన్ని పొందవచ్చు.
మీ టీవీ స్మార్ట్ కాకపోతే , మీరు ఇప్పటికీ పాత మొదటి తరం ఫైర్ టీవీ స్టిక్ ఉపయోగిస్తున్నట్లయితే ఇప్పుడు మీరు ఫైర్ టీవీ స్టిక్ 4Kకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఫైర్ టీవీ స్టిక్ 4K ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో రూ.5999కి విక్రయించబడుతోంది. అయితే, ధరలు ఎప్పుడైనా మారుతాయి. అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మీరు నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా ఇతర కొత్త స్ట్రీమింగ్ సర్వీసులకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఆస్వాదించవచ్చు.
-
Ram Charan: రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ తియ్యబోతున్న నెట్ ఫ్లిక్స్..మరో అరుదైన గౌరవం!
-
Emergency: కంగనా ఎమర్జెన్సీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచంటే?
-
Thandel: ఉండగానే ఓటీటీలోకి తండేల్.. మరీ ఇంత తొందరగానే.. కారణం ఏంటి?
-
Daaku Maharaaj: ఓటీటీలోకి డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?