Ram Charan: రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ తియ్యబోతున్న నెట్ ఫ్లిక్స్..మరో అరుదైన గౌరవం!
Ram Charan నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ కూడా ఒకటి. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి తో ఒక డాక్యుమెంటరీ ని తీసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద కూడా ఒక స్పెషల్ డాక్యుమెంటరీ ని తియ్యబోతున్నట్టు సమాచారం.

Ram Charan: #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్(Global star Ram Charan) క్రేజ్ ప్రపంచం నలుమూలల ఎలా వ్యాప్తి చెందిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హాలీవుడ్ ఆడియన్స్ కూడా రామ్ చరణ్ ని గుర్తు పట్టే రేంజ్ కి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన్ని అభిమానులు గ్లోబల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. రీసెంట్ గానే లండన్ లోనే మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం లో రామ్ చరణ్ మైనపు బొమ్మని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్ లండన్ లోకి అడుగుపెట్టినప్పుడు వేలాదిగా అభిమానులు అక్కడికి వచ్చి ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇతర దేశాల్లో ఆయనకు ఏ రేంజ్ క్రేజ్ ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ గా తీసుకోవచ్చు. రామ్ చరణ్ కి ఉన్న ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం కొన్ని సంస్థలు అనేక విధాలుగా పోటీ పడుతున్నాయి.
అందులో నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ కూడా ఒకటి. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి తో ఒక డాక్యుమెంటరీ ని తీసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద కూడా ఒక స్పెషల్ డాక్యుమెంటరీ ని తియ్యబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ చిన్నప్పటి నుండి, ఇప్పటి వరకు ఎలా పెరిగాడు, కెరీర్ పరంగా ఆయన ఎదురుకున్న సవాళ్లు, క్రియేట్ చేసిన ఆల్ టైం రికార్డ్స్, ఇలా అన్నిటిని కవర్ చేస్తూ ఈ డాక్యుమెంటరీ ఉంటుందట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారని టాక్. అదే విధంగా అభిమానులు ఎప్పటి నుండో క్లిన్ కారా ని పూర్తిగా చూడాలని తాపత్రయం పడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు క్లిన్ కారా ఫోటోలు కనిపించాయి కానీ, అవి పెద్దగా క్లారిటీ లేనివి. పూర్తి స్థాయి ఫోటో లేదా వీడియో కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ లో ఆ చిన్నారి కూడా కనిపించబోతున్నట్టు సమాచారం.
హాలీవుడ్ కి చెందిన నెట్ ఫ్లిక్స్ సంస్థ, ఇలా మన టాలీవుడ్ హీరో గురించి ఒక డాక్యుకేంటరీ చేయడం కోసం ముందుకు రావడం నిజంగా గర్వించదగ్గ విషయమే. రామ్ చరణ్ అభిమానులు ఈ వార్త తెలిసినప్పటి నుండి ఆనందంతో ఉన్నారు. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘గేమ్ చేంజర్’ ఫలితం నుండి అభిమానులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘పెద్ది’ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ లో మంచి జోష్ ని తీసుకొచ్చింది. అదే విధంగా మొన్న మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈరోజు ఈ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వార్త అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే విధమైన ఫ్లో ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తారా లేదో చూడాలి.
-
Dil Raju : దిల్ రాజుకు ‘గేమ్ చేంజర్’ దెబ్బ.. ఏకంగా రూ.100 కోట్లు లాస్.. ఎలా కవర్ చేశాడంటే ?
-
Vishvambhara : చిరంజీవి అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ‘విశ్వంభర’ సినిమా మళ్లీ వాయిదా
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్
-
RGV : రాజ్ కుమార్ రీమేక్ లతోనే ఫేమస్ అయ్యారు.. కన్నడ వివాదానికి అగ్గిరాజేస్తున్న ఆర్జీవీ
-
Netflix : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. జూన్ 2 నుంచి ఆ డివైజ్‌లలో సర్వీసులు బంద్