TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్

TollyWood : ఈ మధ్య మాదకద్రవ్యాల వాడకం బాగా పెరిగిపోయింది. యువత ఎక్కువగా దీనికి బలైపోతున్నారు. ఈ భూతం సినిమా ఇండస్ట్రీని కూడా వదిలిపెట్టట్లేదు. సినీ రంగంలో చాలామంది వాటి మత్తులో పడిపోతున్నారు. దీనివల్ల ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను ఆపడానికి తెలుగు ఇండస్ట్రీ ఒక కఠినమైన నిబంధన తీసుకురావాలని నిర్ణయించుకుంది. మాదకద్రవ్యాలు తీసుకునే ఆర్టిస్టుల మీద బ్యాన్ విధించాలని ఆలోచిస్తున్నారట. ఈ నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. దీనివల్ల సినిమా రంగంలో ఒక పెద్ద మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యసన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులను కూడా పిలిచారు. తెలంగాణ సినిమా అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షుడు దిల్ రాజు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమ కూడా ఇలాంటి రూల్ తీసుకురావాలని ఆలోచిస్తోందని చెప్పారు.
Read Also: Virus Alert : వైరస్ అలర్ట్.. చైనా గబ్బిలాల్లో 20 కొత్త వైరస్‌లు.. మానవాళికి మరో ముప్పు తప్పదా ?
“ఎవరైతే మాదకద్రవ్యాలను తీసుకుంటారో, వారిపై బ్యాన్ విధించాలని మలయాళ సినీ రంగం వాళ్లు నిర్ణయించుకున్నారు. మేము కూడా ఇదే తరహా నిబంధన తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. నేను సినీ పెద్దలతో ఈ విషయం గురించి చర్చిస్తాను. వాటిని వాడేవాళ్లకు మనం ఒక కఠిన సందేశం పంపాలి” అని దిల్ రాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రస్తుతం దిల్ రాజు ప్రస్తావించిన ఈ నిబంధన గనుక అమల్లోకి వస్తే, వాటిని వాడే ఆర్టిస్టులకు కష్టాలు తప్పవు. సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం ఎక్కువైందని, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఏర్పాటు చేసే పార్టీలలో వాటి వాసన వస్తుందని, దీనివల్ల చాలామంది అరెస్ట్ అవుతున్నారని సమాచారం. ఇలాంటి సంఘటనల వల్ల ఇండస్ట్రీ పేరు చెడిపోతోంది.
Read Also:Coolie : రజనీకాంత్ ‘కూలి’ సినిమాకు టైటిట్ గోల.. మళ్లీ కొత్త పేరు.. ఇంతకీ ఏమైందంటే ?
-
Kingdom First Review: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
-
Kingdom Pre Release Event: కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
-
Ram Charan: పెద్దిలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ వైరల్
-
Vijay Deverakonda Stunt: కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతలా కష్టపడ్తున్నాడో చూడండి
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Vijay Deverakonda : పెరిగిపోతున్న విమర్శలు.. పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ