Coolie : రజనీకాంత్ ‘కూలి’ సినిమాకు టైటిట్ గోల.. మళ్లీ కొత్త పేరు.. ఇంతకీ ఏమైందంటే ?

Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘కూలి’ షూటింగ్ పూర్తయి, రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆగస్టు 14న సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. సినిమా హక్కుల అమ్మకాలు, ప్రమోషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అయితే, సడన్‌గా ఈ సినిమాకు తన పేరు విషయంలో ఒక సమస్య ఎదురైంది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో ఇప్పుడు సినిమా పేరు గురించి గందరగోళం మొదలైంది.
సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమాకు ‘కూలి’ అనే పేరే పెట్టారు. రజనీకాంత్ రైల్వే స్టేషన్లో సూట్‌కేసులు మోసే కూలీలా డ్రెస్ వేసుకొని, భుజానికి ‘కూలి’ అనే బ్యాడ్జ్ కట్టుకున్న ఫోటోను షూటింగ్ మొదలుపెట్టకముందే రిలీజ్ చేశారు. కొన్ని నెలలుగా సినిమాను ‘కూలి’ పేరుతోనే ప్రచారం చేశారు. ఇప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా పేరు ‘కూలి’ అనే ఉంది. కానీ, హిందీ వెర్షన్‌కి మాత్రం ఈ పేరుతో సమస్య వచ్చిందని తెలుస్తోంది.
Read Also:Rashmika Mandanna: భయపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లుక్‌లో కొత్త ప్రాజెక్ట్!
హిందీలో కూడా ‘కూలి’ అనే పేరు పెట్టాలని అనుకున్నారు. కానీ, చాలా దశాబ్దాల క్రితం అమితాబ్ బచ్చన్ ‘కూలి’ అనే పేరుతో ఒక హిందీ సినిమాలో నటించారు. ఆ సినిమా నిర్మాత దగ్గర ఇప్పటికీ ‘కూలి’ అనే టైటిల్ హక్కులు ఉన్నాయట. అందుకే, రజనీకాంత్ ‘కూలి’ సినిమా టీమ్‌కు వేరే దారి లేక, పేరును మార్చమని సూచించారట. దీంతో మొదట ‘కూలి’ బదులు ‘మజ్దూర్’ అని పేరు మార్చారు. ‘మజ్దూర్’ అంటే హిందీలో కార్మికుడు అని అర్థం.
కొద్ది రోజుల క్రితం ‘మజ్దూర్’ పేరుతో పోస్టర్లు కూడా బయటకొచ్చాయి. కానీ, ఆ పేరు సినిమా టీమ్‌కు ఎందుకో నచ్చలేదట. అందుకే ఇప్పుడు మళ్ళీ సినిమా పేరు మార్చారు. ఈసారి సినిమా పేరు ‘కూలి ది పవర్ హౌస్’ అని పెట్టారు. ‘కూలి’ అనే పేరు సినిమా పేరులో కచ్చితంగా ఉండాలని టీమ్ భావించి, ‘కూలి ది పవర్ హౌస్’ అనే పేరును హిందీ వెర్షన్‌కి ఖరారు చేశారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.
Read Also:Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!
ఈ ‘కూలి’ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, మలయాళ నటుడు సుబిన్ సోహిర్, నటి శృతి హాసన్, కట్టప్ప ఫేమ్ సత్యరాజ్, రెబా మోనికా జాన్, పూజా హెగ్డే వంటి భారీ తారాగణం నటిస్తోంది. సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.