RGV : రాజ్ కుమార్ రీమేక్ లతోనే ఫేమస్ అయ్యారు.. కన్నడ వివాదానికి అగ్గిరాజేస్తున్న ఆర్జీవీ

RGV : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల మళ్లీ కన్నడిగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గతంలో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయాలని బెదిరించడం ‘కొత్త రకం గూండాయిజం’ అని వర్మ వ్యాఖ్యానించి కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యారు. ఇప్పుడు, ఆయన అమితాబ్ బచ్చన్‌ను పొగుడుతూ, కన్నడ సినీ దిగ్గజం డాక్టర్ రాజ్‌కుమార్‌ను కించపరిచేలా మాట్లాడారు. ఇది సహించరానిదని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా కంటే, వివాదాల ద్వారానే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని పబ్లిసిటీ పొందడం ఆయనకు అలవాటు. ఇప్పుడు ఆయన “అమితాబ్ బచ్చన్ చిత్రాలను రీమేక్ చేయడం ద్వారా రాజ్‌కుమార్ విజయం సాధించారు” అని వ్యాఖ్యానించి మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. “70, 80వ దశకాల్లో అమితాబ్ బచ్చన్ సినిమాలను రీమేక్ చేయడం ద్వారా చాలా మంది పేరు ప్రఖ్యాతులు పొందారు. రజనీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), ఎన్.టి. రామారావు (N.T. Rama Rao), రాజ్‌కుమార్ వంటి నటులు ఈ రీమేక్‌ల ద్వారా విపరీతమైన ప్రజాదరణ పొందారు. 90వ దశకంలో బచ్చన్ ఐదేళ్ల విరామం తీసుకున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ దర్శకులు కూడా ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రభావితమయ్యారు. కానీ దక్షిణాది సినీ దర్శకులు మాత్రం బచ్చన్ స్టైల్ అయిన మాస్ మసాలా తరహాలోనే కథలు చెప్పడం కొనసాగించారు.” అని చెప్పుకొచ్చారు.
Read Also:Norway Chess Tournament: గుకేశ్ మిస్టేక్.. నార్వే చెస్ టోర్నీ విజేతగా మాగ్నస్ కార్ల్సన్
ఆర్జీవీ వ్యాఖ్యలపై తీవ్ర చర్చలు
రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజ్‌కుమార్ ఎన్నో పౌరాణిక పాత్రలు చేశారు. ఇక్కడి నేటివిటీకి తగ్గ కథలను ప్రజల ముందుకు తెచ్చారు. ఈ కారణంగానే ఆయన అందరికీ నచ్చారు తప్ప, రీమేక్‌లు చేసి ఫేమస్ అయ్యారు అనడంలో అర్థం లేదని చాలా మంది కన్నడిగులు ఘాటుగా స్పందిస్తున్నారు.
కన్నడ ప్రజల ఆవేదన
రాజ్‌కుమార్ కన్నడ ప్రజలకు ఒక దేవుడితో సమానం. ఆయనను ఇలా రీమేక్ నటుడిగా పేర్కొనడం, ఆయన గొప్పదనాన్ని తగ్గించడం కన్నడ ప్రజలను తీవ్రంగా బాధించింది. ఇది కన్నడ భాషపై, సంస్కృతిపై మసి పూయడమేనని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వివాదంలో కన్నడ ప్రజలను కెలికిన ఆర్జీవీ, ఇప్పుడు రాజ్‌కుమార్ పై వ్యాఖ్యలతో మరింత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నమే అని చాలా మంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
Read Also:Jamun Vinegar: ఈ వెనిగర్‌తో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. ఒక్కసారి తింటే చాలు
-
Thug Life : కమల్ హాసన్ తర్వాత కన్నడిగుల ఆగ్రహాన్ని రెచ్చగొట్టిన ఆర్జీవీ.. ఇంతకీ ఏమన్నారంటే ?
-
Mega 157: సంక్రాంతికి రఫ్ఫాడించేస్తాం అంటూ.. అనిల్-చిరంజీవి మూవీలో స్టార్ హీరయిన్
-
Ram Charan: రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ తియ్యబోతున్న నెట్ ఫ్లిక్స్..మరో అరుదైన గౌరవం!
-
Mega 157: అనిల్ రావిపూడి చిరంజీవి మూవీ నుంచి వీడియో రిలీజ్ వైరల్
-
Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…
-
Ram Charan : రామ్ చరణ్ డ్యాన్స్ తగ్గుతుందా..? దానికి కారణం ఇదేనా..?