Rajinikanth : హీరోయిన్లతో రొమాన్స్ చేయను.. రజనీకాంత్ సంచలన నిర్ణయం

Rajinikanth : ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు యంగ్ హీరోయిన్లతో కలిసి పని చేయడంపై కొత్త చర్చ మొదలైంది. అయితే, మెగాస్టార్ రజినీకాంత్ మాత్రం తెరపై తక్కువ వయసు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి నిరాకరిస్తున్నారు. సూపర్ స్టార్ దశాబ్దాలుగా భారతీయ సినిమాపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆయన చాలా మంది నటులతో కలిసి పని చేశారు. అందులో యంగ్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఒకసారి రజినీకాంత్ తనకంటే వయసులో చాలా చిన్న వాళ్లయిన హీరోయిన్ తో తెరపై రొమాన్స్ చేయడం గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కాలా సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. తాను ఇకపై తనకంటే సగం వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయదలుచుకోలేదని చెప్పారు. వయసుకు తగ్గ పాత్రలను మాత్రమే చేస్తానని చెప్పారు.
రజినీకాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నాకు 65 సంవత్సరాలు. నాకంటే సగం వయసున్న హీరోయిన్లతో నేను రొమాన్స్ చేయకూడదు. 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కెరీర్ ముగిసిందని కొంతమంది ప్రజలు అంటున్నారు. కానీ దేవుడి దయ, మీ ఆశీస్సులతో నేను ముందుకు సాగుతున్నాను. నా మీద ఎన్ని విమర్శలు వచ్చినా, నేను చేయగలిగిన దాన్ని చేస్తూనే ఉంటాను. నా వయసుకు తగ్గ పాత్రలను మాత్రమే పోషిస్తాను” అని అన్నారు.
Read Also:Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
రజినీకాంత్ తరచుగా వివిధ అంశాలపై తన నిర్మొహమాటంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల తన భార్య లతతో కలిసి ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, భారతీయ యువతలో పాశ్చాత్య సంస్కృతి పట్ల పెరుగుతున్న ఆసక్తిపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఈ మొబైల్ ఫోన్ యుగంలో యువత, కొందరు పెద్దలు కూడా మన దేశ సంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలియకుండానే ఉన్నారు. మన దేశ గొప్పతనం, గౌరవం తెలియకుండానే వారు పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నారు” అని చెప్పారు.
ఇక రజినీ సినిమాల విషయానికి వస్తే 74 సంవత్సరాల వయసులో కూడా రజినీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ. ఈ సినిమా ఆగస్టు 14న పెద్ద తెరపైకి రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజినీకాంత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
Read Also:Shubman Gill : ఒకే టెస్ట్‌తో 15 స్థానాలు ఎగబాకిన శుభ్‌మన్ గిల్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సంచలనం
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Bollywood Khans : ఒకే సినిమాలో షారుఖ్, సల్మాన్, ఆమిర్.. అభిమానులకు పండుగే
-
Coolie : రజనీకాంత్ ‘కూలి’ సినిమాకు టైటిట్ గోల.. మళ్లీ కొత్త పేరు.. ఇంతకీ ఏమైందంటే ?
-
Aamir Khan : కేవలం 8 నిమిషాలకే రూ. 30 కోట్లు..రజనీకాంత్ ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ కామియోరోల్
-
Aamir Khan : ముంబై వీధుల్లో వడాపావు అమ్ముతున్న అమీర్ ఖాన్.. ఏంటి స్టార్ హీరో ఈ పని చేస్తున్నాడు ?
-
RGV : రాజ్ కుమార్ రీమేక్ లతోనే ఫేమస్ అయ్యారు.. కన్నడ వివాదానికి అగ్గిరాజేస్తున్న ఆర్జీవీ