Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Aamir Khan Sells Vada Pav For Sitare Zameen Par

Aamir Khan : ముంబై వీధుల్లో వడాపావు అమ్ముతున్న అమీర్ ఖాన్.. ఏంటి స్టార్ హీరో ఈ పని చేస్తున్నాడు ?

Aamir Khan : ముంబై వీధుల్లో వడాపావు అమ్ముతున్న అమీర్ ఖాన్.. ఏంటి స్టార్ హీరో ఈ పని చేస్తున్నాడు ?
  • Edited By: rocky,
  • Updated on June 8, 2025 / 01:49 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఆయన నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ (Thugs of Hindostan), ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఆయన ‘సితారే జమీన్ పర్’ (Sitare Zameen Par) సినిమాలో నటించారు. ఇది ఒక రకంగా ఆయనకు కమ్‌బ్యాక్ సినిమా. అందుకే అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ప్రమోషన్ కోసం అమీర్ ఖాన్ రకరకాల సర్కస్‌లు చేస్తున్నారు. ముంబై వీధిలో వడా పావ్ (Vada Pav) అమ్మడం దీనికి ఉదాహరణ.

ముంబై వీధిలో వడా పావ్ అమ్మిన అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ ముంబై వీధిలో నిలబడి వడా పావ్ అమ్మారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రచారం కోసమే చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేశారు. “ప్రచారం కోసం ఏమేం చేయాల్సి వస్తుందో” అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Read Also:UGC NET: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఔట్

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

అమీర్ ఖాన్ సొంత సినిమా
‘సితారే జమీన్ పర్’ సినిమాలో అమీర్ ఖాన్‌తో పాటు జెనీలియా దేశ్‌ముఖ్ (Genelia Deshmukh), అనేక మంది కొత్త నటీనటులకు అవకాశం కల్పించారు. స్వయంగా అమీర్ ఖానే ఈ సినిమాకు పెట్టుబడి పెట్టారు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

అమ్మ కోరికతో సినిమాలో ప్రత్యేకత
అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ (Zeenat Hussain) వయసు ఇప్పుడు 91 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె సినిమా షూటింగ్‌ను చూడాలని కోరుకున్నారు. ‘సితారే జమీన్ పర్’ చిత్ర షూటింగ్ చూడటానికి ఆమె వెళ్లారు. అప్పుడు ఆమెను ఒప్పించి, ఒక షాట్‌లో నటించేలా చేశారు. ఈ కారణంతో కూడా అమీర్ ఖాన్ ఈ సినిమాను ప్రత్యేకంగా భావిస్తున్నారు.

Read Also:China Trend : హగ్ చేసుకుంటే అమ్మాయిలే రూ.600ఇస్తారంట.. అబ్బాయిలు గెట్ రెడీ

‘ఛాంపియన్స్’ రీమేక్
‘సితారే జమీన్ పర్’ సినిమా ‘ఛాంపియన్స్’ (Champions) అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ట్రైలర్ చూసిన అభిమానులు బాగా నచ్చింది. సినిమా విడుదల కాకముందే అమీర్ ఖాన్ తన స్నేహితులను పిలిచి ఒక పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అమీర్ ఖాన్ ఈ సినిమాతో బాలీవుడ్‌లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది జూన్ 20న తెలియనుంది.

Tag

  • Aamir Khan
  • Bollywood Comeback
  • Movie Promotion
  • Sitare Zameen Par
  • Vada Pav Stunt
Related News
  • Rajinikanth : హీరోయిన్లతో రొమాన్స్ చేయను.. రజనీకాంత్ సంచలన నిర్ణయం

  • Bollywood Khans : ఒకే సినిమాలో షారుఖ్, సల్మాన్, ఆమిర్.. అభిమానులకు పండుగే

  • Aamir Khan : కేవలం 8 నిమిషాలకే రూ. 30 కోట్లు..రజనీకాంత్ ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ కామియోరోల్

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us