Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Education News »
  • Ugc Net Exams Dates Out Now

UGC NET: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఔట్

UGC NET: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఔట్
  • Edited By: kusuma,
  • Updated on June 8, 2025 / 01:22 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

UGC NET: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. యూజీసీ నెట్ పరీక్షలు జూన్ 25 నుంచి 29 వరకు జరుగుతాయని తెలిపింది. ఈ పరీక్షను 85 సబ్జెక్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్‌లో పరీక్ష జరుగుతుంది. రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. జూన్ 25న ఉదయం షిఫ్ట్‌లో ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు జరగ్గా, సాయంత్రం షిఫ్ట్‌లో ఎలక్ట్రానిక్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం పరీక్షలు జరుగుతాయి.

జూన్ 26న ఉదయం షిఫ్ట్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, మ్యూజిక్ పరీక్షలు జరగ్గా, సాయంత్రం షిఫ్ట్‌లో పొలిటికల్ సైన్స్, ఇండియన్ కల్చర్, బౌద్ధం, జైన్, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఆర్కియాలజీ పరీక్షలు జరుగుతాయి. జూన్ 27న ఉదయం షిఫ్ట్‌లో కామర్స్, లింగ్విస్టిక్స్, విజువల్ ఆర్ట్స్ (పెయింటింగ్/ స్కల్ప్చర్/ డిజైన్/ అప్లైడ్ ఆర్ట్/ ఆర్ట్ హిస్టరీ), టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ పరీక్షలు జరగ్గా.. సాయంత్రం షిఫ్ట్‌లో ఇంగ్లిష్, యోగా, హిందూ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 28న ఉదయం షిఫ్ట్‌లో హిస్టరీ పరీక్షలు జరగ్గా సాయంత్రం షిఫ్ట్‌లో మేనేజ్‌మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించారు. జూన్ 29న ఉదయం షిఫ్ట్‌లో హిందీ, ఫ్రెంచ్, సోషియాలజీ పరీక్షలు నిర్వహించగా సాయంత్రం షిఫ్ట్‌లో జాగ్రఫీ, ఎకనామిక్స్, మ్యూజియాలజీ, కన్జర్వేషన్ పరీక్షలు నిర్వహిస్తారు.

యూజీసీ నెట్ పరీక్షను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత (ఎలిజిబిలిటీ), పీహెచ్‌డీ ప్రవేశం కోసం సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఇది దేశంలోనే ఉన్నత విద్యలో పరిశోధన, బోధన రంగాలలోకి అడుగు పెట్టాలనుకునే వారికి ఒక ముఖ్యమైన పరీక్ష. ఇందులో పేపర్-1లో జనరల్ ఆప్టిట్యూడ్, టీచింగ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇది అందరికీ కలిపి ఉంటుంది. పేపర్-2లో అభ్యర్థులు తమ ఎంచుకున్న సబ్జెక్టు నుంచి పరీక్ష ఉంటుంది. రెండు పేపర్లకు కలిపి కనీస అర్హత మార్కులు ఉంటాయి. జనరల్ కేటగిరీకి 40 శాతం, రిజర్వ్డ్ కేటగిరీకి 35 శాతం ఉంటుంది. పరీక్ష తేదీకి కొన్ని రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల అవుతాయి. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000కు కాల్ చేయవచ్చు. లేదా ugcnet@nta.ac.inకు ఇమెయిల్ ద్వారా డౌట్‌లు క్లియర్ చేసుకోవచ్చు.

Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!

Tag

  • admit cards
  • exams
  • june month
  • UGC Net
Related News
  • TG CPGET 2025: తెలంగాణ పీజీ ప్రవేశాలు.. CPGET 2025 నోటిఫికేషన్ ఈ వారమే!

  • AP PGECET 2025: ఏపీ పీజీ సెట్ 2025 పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

  • DSC: డీఎస్సీ హాల్ టికెట్లు అభ్యంతరాలు ఉంటే.. సంప్రదించాల్సిన నంబర్లు ఇవే

  • Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి

Latest Photo Gallery
  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us