AP PGECET 2025: ఏపీ పీజీ సెట్ 2025 పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

AP PGECET 2025: ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్ 2025 (AP PGCET-2025) పరీక్షలు జూన్ 9 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థులు ఈ పరీక్షను తప్పకుండా రాయాలి. అయితే ఈ పరీక్ష షెడ్యూల్ పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఏపీ పీజీసెట్ 2025 పరీక్షలు జూన్ 9వ తేదీన ప్రారంభం కాగా.. జూన్ 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు. పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తారు. ఈ సంవత్సరం ఏపీ పీజీసెట్-2025 పరీక్షలకు దాదాపు 25,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరు కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో నిర్ణీత సమయానికి చేరుకొని పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ల లోని వివరాలను సరి చూసుకొని పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాలు ఇతర ప్రక్రియలకు సంబంధించిన తేదీలను కూడా అధికారులు ప్రకటించారు. జూన్ 15 మధ్య ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని జూన్ 15 నుంచి జూన్ 17 వరకు స్వీకరిస్తారు. విద్యార్థులు తమ అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. పరీక్ష ఫలితాలు జూన్ 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఏపీ పీజీసెట్ 2025లో సాధించిన ర్యాంకుల ఆధారంగా, ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.పీజీ కోర్సులు చేయాలనుకుంటున్న విద్యార్థులకు ఏపీ పీజీసెట్ ఒక మంచి అవకాశం.
ఇది కూడా చూడండి: The Raja saab Teaser: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ది రాజాసాబ్ టీజర్ డేట్ ఫిక్స్
-
Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?
-
TG CPGET 2025: తెలంగాణ పీజీ ప్రవేశాలు.. CPGET 2025 నోటిఫికేషన్ ఈ వారమే!
-
APEAPCET: వచ్చేసిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతో ఇలా తెలుసుకోండి
-
UGC NET: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఔట్
-
Andhra Pradesh: ఏపీ కేబినెట్.. మహిళలకు గుడ్ న్యూస్