TG CPGET 2025: తెలంగాణ పీజీ ప్రవేశాలు.. CPGET 2025 నోటిఫికేషన్ ఈ వారమే!

TG CPGET 2025: తెలంగాణ రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పకుండా ఎంట్రెన్స్ పరీక్ష రాయాలి. వీటి కోసం ప్రభుత్వం కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఇందులో క్వాలిఫై అయితేనే పీజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. అయితే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ), మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకాం), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్‌సీ) వంటి పీజీ కోర్సులు ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా కీలకమైన ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఇప్పటికే రిలీజ్ చేస్తారు. పరీక్షలు అయి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా రాలేదు. అయితే ఈ నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. ఈ వారంలో నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది.
గతేడాది సీపీగెట్ నోటిఫికేషన్ మే 16వ తేదీన విడుదలైంది. కానీ ఈ సంవత్సరం జూన్ నెల వచ్చినా ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే ఈ ఏడాది కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయమే సీపీగెట్ ప్రవేశ పరీక్షల బాధ్యతలను నిర్వహించనుంది. దీనికి తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. అయితే పరీక్ష రాసే ముందు నచ్చిన సబ్జెక్టుల్లో ఎంట్రెన్స్ పరీక్షలు రాయవచ్చు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
తెలంగాణ సీపీగెట్ పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఈ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. సబ్జెక్టును బట్టి ప్రశ్నపత్రం విధానం మారుతుంది. బయోకెమిస్ట్రీ వంటి సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు ఉంటాయి. పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-బిలో విద్యార్థులు తమ డిగ్రీ (బీఎస్సీ)లో చదివిన ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ వంటి ఆప్షనల్ సబ్జెక్టు నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బిలో బయోటెక్నాలజీ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు పీజీ సీట్లను కేటాయిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, సిలబస్ వంటి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Iphone 17: ఐఫోన్ 17 సిరీస్ లీక్ అయిన డిజైన్ చూశారా.. సూపర్ ఉన్నాయ్
-
UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. లావాదేవీలపై ఇక ఛార్జీలు?
-
SSC CGL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 14,582 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
-
AP PGECET 2025: ఏపీ పీజీ సెట్ 2025 పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Urine Hold Health Issue: మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకుంటే.. పిల్లలు పుట్టడం కష్టమేనా?
-
UGC NET: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఔట్