Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Early Morning Anjeer: అంజీర్ పండ్లను తెలుగులో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి కేవలం రుచిగానే కాకుండా, పోషకాలతో నిండిన పండ్లు. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ అద్భుతమైన పండ్లను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేదంలో కూడా అంజీర్ పండ్లకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే ప్రతిరోజూ అంజీర్ పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడంతో పాటు వాటిని కూడా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగు పడటం
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి అంజీర్ పండ్లు బాగా సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంజీర్‌లో ఉండే అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు
నానబెట్టిన అంజీర్ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంజీర్ పండ్లలో సహజంగా లభించే చక్కెర ఉన్నప్పటికీ, వాటిలోని ఫైబర్ నెమ్మదిగా చక్కెరను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడేవారు మితంగా వీటిని తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడానికి అంజీర్ బాగా సహాయపడుతుంది.
అధిక బరువు
బరువు తగ్గాలనుకునే వారికి నానబెట్టిన అంజీర్ నీళ్లు చాలా మంచివి. అంజీర్‌లోని ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో ఆకలి తగ్గడం వల్ల పదే పదే ఆహారం తీసుకోరు. దీనివల్ల బరువు తొందరగా తగ్గుతారు.
రోగనిరోధక శక్తి
అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కొనే ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి. అలాగే శరీరంలోని నొప్పిని తగ్గించడంలో కూడా ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంజీర్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
రక్తపోటు నియంత్రణ
అంజీర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టం రాకుండా చేయడంతో పాటు రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పొటాషియం రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ వాటర్ రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
చర్మ ఆరోగ్యం
ప్రతిరోజూ నానబెట్టిన అంజీర్ వాటర్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంజీర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంజీర్ నీటిని చర్మంపై రాసుకుంటే మృత కణాలు తొలగిపోయి, చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. అలాగే చర్మం నిగారింపును పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Plants at home: ఈ మొక్కలు పెంచితే.. ప్రపంచమంతా అందం మీ ఇంట్లోనే!
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Lethargy: తీవ్ర అలసట ఇబ్బంది పెడుతుందా.. ఇవి తినడం మరిచిపోవద్దు