Lethargy: తీవ్ర అలసట ఇబ్బంది పెడుతుందా.. ఇవి తినడం మరిచిపోవద్దు

Lethargy: కొందరికి ఎక్కువగా పని చేస్తే నీరసం, అలసట వస్తాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువగా అలసట ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఉదయం ఇంట్లో వంట, పనులు చేయడం వంటివి చేస్తుంటారు. నిజం చెప్పాలంటే పనుల వల్ల సరిగ్గా ఫుడ్ తీసుకోరు. డైలీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. దీనికి తోడు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కొందరి మహిళలకు నీరసంగా ఉంటుంది. కాస్త చిన్న పని చేసినా కూడా అలసటగా అనిపించి నిద్రపోతుంటారు. పోనీ నిద్రపోయినా కూడా ఆ అలసట తగ్గిపోతుందా అంటే అలా కూడా ఉండదు. వీటికి తోడు పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మందికి అలసటగా అనిపిస్తుంది. అయితే ఎలాంటి నీరసం, అలసట లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
అలసట, నీరసం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా డైలీ పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. వీటితో పాటు ప్రొటీన్ ఎక్కువగా ఉన్నవి తినాలి. ముఖ్యంగా ఉదయం పూట తీసుకుంటే రోజంతా తక్షణ శక్తి లభిస్తుంది. ఎలాంటి నీరసం, అలసట లేకుండా రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు. అలసట వంటి సమస్యలు రాకూడదంటే రోజూ కూడా తాజా కూరగాయలు, పోషకాలు, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. అలాగే విటమిన్లు అధికంగా ఉండే పదార్థాలను కూడా డైలీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కొత్తలోనే తగ్గించుకోవాలి. తీవ్రమైతే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాడీకి శక్తి లేకపోతే అలసట పెరిగి చిరాకు వస్తుంది. దీంతో ఏకాగ్రత కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. చాలా మంది ఈ రోజుల్లో పోషకాలు లేని ఫుడ్‌ను తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా అలసట వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు డైలీ కాస్త వ్యాయామం చేయాలి. దీనివల్ల మైండ్ కాస్త రిఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చేసినా కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చిరాకు, అలసట, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
అలసట తగ్గాలంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ డ్రైఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఇందులోని పోషకాలు శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంచుతాయి. చర్మాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషించేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. డైలీ ఏదో విధంగా గుప్పెడు డ్రైఫ్రూట్స్ అయినా కూడా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఎంతటి అలసట అయినా కూడా ఈజీగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!
-
Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?
-
Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!
-
Healthy Foods: ఈ 6 రకాల ఫుడ్స్ తీసుకుంటే.. వందేళ్లు జీవించడం గ్యారెంటీ
-
Dry Fruits: ఉదయం ఏ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
-
Health Benefits: ఈ టీ డైలీ తాగితే.. మీ ఆయుష్షు పెరగడం ఖాయం
-
Kidney Issues: వీటిని మీరు డైలీ తీసుకుంటే.. మీ కిడ్నీలు సేఫ్