Health Benefits: ఈ టీ డైలీ తాగితే.. మీ ఆయుష్షు పెరగడం ఖాయం

Health Benefits: ఉదయం పూట చాలా మందికి కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా కొందరికి అయితే అసలు టీ, కాఫీ తాగనిదే రోజు కూడా గడవదు. అయితే ఏ టీ, కాఫీ తాగడం వల్ల ఉదయం పూట యాక్టివ్‌గా ఉంటారు. చిరాకు, నిద్ర మత్తు అన్ని కూడా తొలగిపోతాయి. కానీ కాఫీ, టీ ఏదో ఒక రోజు పర్లేదు. కానీ డైలీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టీ కాకుండా బ్లాక్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మరణం వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందట. అయితే డైలీ బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉదయం పూట బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ తాగితే ఎక్కువ ఏళ్లు జీవిస్తారు. అంత తొందరగా మరణం కూడా రాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు వరకు తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. రోజుకి రెండు కప్పుల వరకు బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ తాగితే 14 శాతం మరణ ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇందులో పాలు, చక్కెర కలిపితే ఎలాంటి ఫలితం ఉండదు. ఈ రెండు లేకుండా తాగిన టీతోనే ఆరోగ్యం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ టీలో మళ్లీ షుగర్ వేస్తే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి షుగర్ వంటివి లేకుండా మాత్రమే బ్లాక్ టీ, కాఫీ వంటివి తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే బ్లాక్ కాఫీ, టీలోని పోషకాలు శరీర బరువును కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. US నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే చేసింది. 20 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 46,000 కంటే ఎక్కువ మందిపై పరిశోధనలు చేశారు. షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ, టీ తాగిన వారిలో క్యాన్సర్, గుండె జబ్బులు లేవని తేలింది. షుగర్ వేసి తాగిన వారికి ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.
ఈ బ్లాక్ కాఫీలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలను అయినా కూడా క్లియర్ చేస్తాయి. డైలీ ఉదయం పూట ఒక కప్పును తాగడం వల్ల కాలేయ సమస్యలు కూడా తీరుతాయని నిపుణులు అంటున్నారు. బ్లాక్ టీ, కాఫీ వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. యంగ్ లుక్‌లో ఉంటారు. ముఖ్యంగా ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు అన్ని కూడా తగ్గిపోతాయి. ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సాధారణ కాఫీ కాకుండా బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ డైలీ ఉదయం పూట తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?
-
Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?
-
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇప్పుడే తినండి.. మళ్లీ దొరకదు