Healthy Foods: ఈ 6 రకాల ఫుడ్స్ తీసుకుంటే.. వందేళ్లు జీవించడం గ్యారెంటీ

Healthy Foods: వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే తప్పకుండా కొన్ని రకాల పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రొటీన్లు, విటమిన్లు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్, పోషకాలు లేని ఫుడ్, ఎక్కువగా మసాలా వంటివి తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు వందేళ్లు జీవించాల్సిన వారు కూడా 40 ఏళ్లకే చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. అయితే వంద సంవత్సరాలు జీవించాలంటే ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి. భూమి నుండి పండించిన వస్తువులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా వందేళ్ల పాటు జీవిస్తారని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఐదు ప్రదేశాలకు బ్లూ జోన్ హోదా ఉంది. బ్లూ జోన్ అంటే ఈ ప్రదేశాలలో ప్రజల వయస్సు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే చాలా ఎక్కువ. సగటున ఇక్కడి ప్రజలు 90 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం ఉన్న సమాజాలు ఇవే. ఇక్కడి ప్రజలలో అల్పాహారం అతిపెద్ద ప్రాధాన్యత. తరచుగా ఈ ప్రజలు అల్పాహారం రూపంలో రోజులో అతిపెద్ద భోజనం చేస్తారు.
Read Also:Suryakumar Yadav : ఆస్పత్రిలో చేరిన స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇంతకీ ఏమైందంటే ?
ఆరోగ్యంగా వందేళ్ల పాటు జీవించాలంటే రాజులాగా అల్పాహారం, యువరాజులాగా భోజనం, పేదవాడిలా రాత్రి భోజనం చేయాలన్నా సామెత గురించి తెలిసిందే. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సార్డినియా వంటి ప్రదేశాలలో ప్రజలు ఉదయం పూట ఎక్కువగా అల్పాహారం తీసుకుంటారు. దీనివల్ల వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు జీవిస్తారని అంటున్నారు. అయితే రాత్రిపూట తొందరగా తిని మళ్లీ ఉదయం పూట తినాలి. ఎక్కువ సమయం ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే బీన్స్, ఆకుపచ్చ కూరగాయలు, బియ్యం, పండ్లు, మిసో, ఓట్స్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఆకుపచ్చనా కూరగాయలు, ఓట్స్ వంటి వాటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా కూరగాయలు, బీన్స్ వంటి వాటిలోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. బీన్స్‌ను పేదవాడి మాంసం అంటారు. వీటిని డైలీ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎక్కువ కాలం పాటు జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Blood Sugar : బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఈ పండ్లను తినొద్దు
-
Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?
-
Lethargy: తీవ్ర అలసట ఇబ్బంది పెడుతుందా.. ఇవి తినడం మరిచిపోవద్దు
-
Kidney Issues: వీటిని మీరు డైలీ తీసుకుంటే.. మీ కిడ్నీలు సేఫ్
-
Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే
-
Vitamin D: విటమిన్ డి లోపం ఉందా.. ఈ చిట్కాలు పాటించండి