Vitamin D: విటమిన్ డి లోపం ఉందా.. ఈ చిట్కాలు పాటించండి

Vitamin D: మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది విటమిన్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, బాడీకి సరిపడా విటమిన్లు అందకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వయస్సులోనే సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ మందికి విటమిన్ల లోపం ఏర్పడటంతో పాటు జుట్టు రాలిపోవడం, చర్మం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యలు అన్ని కూడా పెద్ద అయిన తర్వాత వస్తాయి. కానీ ప్రస్తుతం రోజుల్లో అయితే చిన్న వయస్సులోనే చాలా మందికి ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ముఖ్యంగా విటమిన్ డి లోపమే కారణం. వీటిలో ప్రొటీన్లు, మాంసకృత్తులు వంటివి అన్ని కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ విటమిన్ డి తినే పదార్థాలతో పాటు సూర్యరశ్మి నుంచి వస్తుంది. సూర్యరశ్మి శరీరంపై పడటం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు నిరోధకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే బీపీ అదుపులో ఉండటంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. కొందరు మానసిక సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి విటమిన్ డి బాగా ఉపయోగపడుతుంది. మూడ్ స్వింగ్స్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను కూడా విటమిన్ డి తగ్గిస్తుంది. బాడీకి సరిపడా విటమిన్ డి లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులకు సమస్యలు వస్తాయి. వారికి విటమిన్ డి లోపం ఉంటే పుట్టే పిల్లలకు కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. వారికి చిన్నతనంలోనే ఎముకలు, కండరాల సమస్యలు వస్తాయి.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
పెద్ద వాళ్లకు పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ విటమిన్ డి సమస్య రాకుండా ఉండాలంటే సూర్యరశ్మిలో ఉండటంతో పాటు పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఉదయం సూర్యరశ్మిలో ఉండటం వల్ల బాడీకి విటమిన్ డి అందుతుంది. ఉదయం తొమ్మిది గంటల్లోపు ఉంటేనే విటమిన్ డి బాడీకి సరిపోతుంది. అయితే సూర్యరశ్మిలో ఒక 20 నిమిషాల పాటు ఉంటే సరిపోతుంది. విటమిన్ డి సూర్యరశ్మితో పాటు ఫుడ్స్‌లో కూడా లభ్యమవుతుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, చేపలు సాల్మన్, ట్యూనా, సార్‌డైన్స్, మాకెరెల్ వంటి చేపల్లో ఉంటుంది. వీటితో పాటు పుట్టగొడుగులు, పనీర్‌లో కూడా డి విటమిన్ ఉంటుంది. వీటితో పాటు తృణ ధాన్యాలు, సోయా, బాదం, పాలు, ఆరెంజ్ జ్యూస్, బ్రెడ్ వంటి వాటి ద్వారా కూడా బాడీకి విటమిన్ డి ఎక్కువగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
joint pain : కీళ్ల నొప్పులు బాధ పెడుతున్నాయా? ఇలా చేయండి. నొప్పులు మాయం అవుతాయి.
-
Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు
-
Vitamin D : విటమిన్ డి టాబ్లెట్స్, ఇంజెక్షన్లు కూడా తీసుకుంటున్నారా?
-
Health Issues: ఎక్కువగా చెమటలు వస్తున్నాయా.. మీకు ఈ సమస్యలు ఉన్నట్లే
-
Uric Acid: యూరిక్ యాసిడ్ ఇబ్బంది పెడుతుందా.. ఈ ఫుడ్స్ తీసుకోండి