Weight Gain: బక్కగా ఉన్నారా.. వీటిని డైలీ తీసుకుంటే నెల రోజుల్లో వెయిట్ పెరగడం ఖాయం

Weight Gain: సన్నగా ఉండకుండా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం కూడా ఉండాలి. కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి. ఒక వేళ ఈ లోపం ఏర్పడితే ఎముకలు బలహీనంగా తయారు అయి బోలు ఎముకల వ్యాధులు వస్తాయి. అలాగే బరువు కూడా తగ్గుతారు. అదే ఎముకలు బలంగా ఉంటే ఫిట్‌గా కనిపిస్తారు. బాడీకి తగినంత కాల్షియం అందితేనే ఎముకలు బలంగా ఉంటాయి. అయితే ఈ కాల్షియం ఎక్కువగా పాలలో ఉంటుందని అంటుంటారు. దీంతో చాలా మంది పాలు ఎక్కువగా తీసుకుంటారు. కానీ ప్రస్తుతం రోజుల్లో పాలు కూడా కల్తీ అవుతున్నాయి. అయితే కాల్షియం అనేది కేవలం పాలలో కాకుండా మిగతా వాటిలో కూడా ఉంది. నిజం చెప్పాలంటే పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుంది. అయితే పాలలో కాకుండా ఎందులో అధికంగా కాల్షియం ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
చియా
చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాల కంటే ఇందులోనే ఎక్కువగా కాల్షియం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. చియా సీడ్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చియా సీడ్స్‌ను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి డైలీ వీటిని ఏదో విధంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
రాజ్ గిరా
ఈ రాజ్ గిరా విత్తనాలలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. దీంతో బక్కగా ఉన్నవారు కూడా లావు అవుతారు. వీటిలో కాల్షియంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. డైలీ వీటిని తీసుకోవడం వల్ల కండరాలు కూడా బలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
గుమ్మడి
ఈ గింజల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. డైలీ ఒక రెండు స్పూన్ల గుమ్మడి విత్తనాలను తినడం వల్ల పాలలోని ఉన్న పోషకాలు కంటే ఎక్కువగా బాడీకి అందుతాయి. ఇందులోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. అయితే కొందరు వీటిని రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటారు. ఇలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు.
మునగ ఆకులు
ఈ ఆకుల్లో ఎక్కువగా ఐరన్ ఉండటంతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. పాలలో కంటే ఇందులో 10 రెట్ల కాల్షియం ఉంటుంది. దీన్ని డైలీ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. అలాగే ఒక్కసారిగా బరువు కూడా పెరుగుతారని నిపుణులు అంటున్నారు. అయితే వీటిని కొందరు కూర వండితే మరికొందరు వీటితో జ్యూస్‌లు చేసి తాగుతారు. ఇలా చేయడం వల్ల కూడా బాడీకి పోషకాలు అందుతాయి.
తెల్ల నువ్వులు
ఈ నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కొందరికి పాలు అంటే నచ్చవు. అలాంటి వారు ఈ తెల్ల నువ్వులను డైలీ ఒక స్పూ్న్ తీసుకోవడం వల్ల కాల్షియం అందుతుంది. పాలలో కంటే ఈ తెల్ల నువ్వుల్లో దాదాపుగా 8 రెట్లు కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుందని నిపుణులు అంటున్నారు. పాలు తాగడం ఇష్టం లేకపోతే వాటికి బదులు వీటిని తీసుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Magnesium Deficiency : కండరాల బలహీనత, ఆస్తమాకు ఈ 5 ఆహారాలతో చెక్ పెట్టేయండి
-
Packaged Milk : ప్యాకెట్ పాలను మరిగించి తాగాలా లేదా పచ్చివే తాగాలా.. నిపుణులు ఏమంటున్నారంటే ?
-
Vitamin D: విటమిన్ డి లోపం ఉందా.. ఈ చిట్కాలు పాటించండి
-
AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?
-
Chicken: చికెన్ అతిగా తినేవారికి పొంచి ఉన్న ప్రమాదం
-
joint pain : కీళ్ల నొప్పులు బాధ పెడుతున్నాయా? ఇలా చేయండి. నొప్పులు మాయం అవుతాయి.