Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే

Breakfast: అల్పాహారం రోజులో చాలా ముఖ్యమైనది. రోజులో ఏ పూట అయినా కూడా తినడం మానేయవచ్చు. కానీ ఉదయం పూట అల్పాహారం మాత్రం అసలు తినడం మిస్ కాకుడదు. టిఫిన్ ఉదయం పూట స్కి్ప్ చేస్తే అది ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది. ఉదయం పూట టిఫన్ స్కిప్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే రోజూ ఉదయం పూట టిఫిన్ స్కిప్ చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
పేలవమైన జీవక్రియ
అల్పాహారం తినకపోవడం వల్ల మీ జీవక్రియ నెమ్మదిస్తుంది. ఒక రాత్రి ఉపవాసం తర్వాత మీ శరీరానికి దాని విధులను ప్రారంభించడానికి శక్తి అవసరం. అల్పాహారం లేకుండా మీ శరీరం జీవక్రియ ప్రక్రియలను సరిగ్గా చేయలేదు. దీనివల్ల మీకు జీర్ణ సమస్యలు, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు అన్ని కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.
ఊబకాయం
మీరు అల్పాహారం తినకపోతే మాత్రం కాస్త తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. వీటిలో అధిక చక్కెర ఉండటం, కొవ్వు పదార్ధాలు వంటివి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా అనారోగ్యానికి గురై ఊబకాయం వంటి సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట పూర్తిగా తినకపోతే మాత్రం చిరాకు, నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
ఆలోచించే విధానం
అల్పాహారం మెదడు పనితీరుకు శక్తిని ఇస్తుంది. ఉదయం పూట పూర్తిగా తినకపోతే మాత్రం శరీరానికి సమస్యలు వస్తాయి. సరిగ్గా ఆలోచించలేరు. అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి. కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. కనీసం ఏకాగ్రత కూడా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో అసలు టిఫిన్‌ను స్కిప్ చేయవద్దని నిపుణులు అంటున్నారు.
మానసిక సమస్యలు
అల్పాహారం తినకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో చిరాకు, ఆందోళన, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అదే మీరు ఉదయం పూట అల్పాహారం తింటే బాడీలో నుంచి సెరోటోనిన్ విడుదల అవుతుంది. ఇది న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ
ఇన్సులిన్ నిరోధకత లేదా డయాబెటిస్ ప్రమాదం ఉన్న వ్యక్తులు అల్పాహారం తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
-
Health Issues: ఆరోగ్యానికి మంచిదని ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇలా చేశారో.. అంతే సంగతులు
-
Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!
-
Banana: ఈ పండు తిన్న తర్వాత ఈ మిస్టేక్స్ చేశారో.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే