Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!

Drinking Water: కొందరికి దాహం వేస్తేనే నీరు తాగుతుంటారు. లేకపోతే అసలు రోజులో కనీసం ఒక లీటరు నీరు అయినా కూడా తాగరు. నీరు అనేది ప్రతీ మనిషికి కూడా అవసరం. ఈ నీరు తక్కువ అయితే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాడీకి సరిపడా వాటర్ లేకపోతే డీహైడ్రేషన్ అవుతుంది. దీంతో చర్మ సమస్యలు, మొటిమలు, చిరాకు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దాహం వేసినా, వేయకపోయినా కూడా తప్పకుండా డైలీ ఒక మూడు లేదా నాలుగు లీటర్ల వరకు వాటర్ తాగాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే ఒక్కసారిగా వాటర్ ఎక్కువగా తాగకుండా.. ఒక పది లేదా 15 నిమిషాలకు కాస్త వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే వాటర్ సరిగ్గా తాగకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఎందుకు వాటర్ ఎక్కువగా తాగాలి ఈ స్టోరీలో చూద్దాం.
బాడీకి ఫుడ్ ఎంత ముఖ్యమో వాటర్ కూడా అంతే ముఖ్యం. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. వాటర్ బాడీకి లేకపోతే డీహైడ్రేషన్ అవుతుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే బాడీకి వాటర్ తగ్గితే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీనివల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల అంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి రోజుకి సరిపడా వాటర్‌ను తప్పకుండా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. వాటర్ తక్కువగా తాగితే ఏకాగ్రత తగ్గుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. మైండ్ రిఫ్రెష్‌గా ఉండాలంటే తప్పకుండా కూడా వాటర్ తాగాలి. దీనివల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఇంకా ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
వాటర్ తక్కువగా తాగితే చర్మ సమస్యలు కూడా వస్తాయి. ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖానికి ఏవైనా క్రీంలు రాస్తే బాగా ఫెయిర్ అవుతారని చాలా మంది అనుకుంటారు. కానీ వాటర్ వల్ల ముఖం ఫెయిర్ అవుతుంది. బాడీకి సరిపడా వాటర్ తీసుకోవడం వల్ల చర్మం క్లియర్‌గా ఉంటుంది. ఎలాంటి మొటిమలు, మచ్చలు కూడా ఉండవు. చర్మం మీద నలుపు పోయి మెరిసిపోతారు. ముఖం కూడా కాంతివంతంగా మెరుస్తుంది. అందరిలో మీరే గ్లోగా కనిపిస్తారు. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ముసలితనం రాకుండా ఎక్కువగా యంగ్ లుక్‌లో ఉంటారు. వయస్సు పెరిగినా కూడా అలా కనిపించకుండా యంగ్ లుక్‌లో అనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Health Issues: ఆరోగ్యానికి మంచిదని ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇలా చేశారో.. అంతే సంగతులు
-
Skin Health: తినే రైస్‌తో చర్మ సౌందర్యం.. ఇలా ప్యాక్ వేసుకుంటే మిస్ వరల్డ్ మీరే
-
Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!
-
Banana: ఈ పండు తిన్న తర్వాత ఈ మిస్టేక్స్ చేశారో.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే
-
Fresh Coconut : పచ్చి కొబ్బరిని పక్కన పెట్టొద్దు.. అపోహలు వీడండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి