RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!

RailOne : ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్. టికెట్ బుకింగ్, ట్రైన్ స్టేటస్ చూడటం, ఫుడ్ ఆర్డర్ చేయడం.. ఇలా రైల్వేకు సంబంధించిన అన్ని పనుల కోసం వేరు వేరు యాప్‌లు వాడే రోజులు పోయాయి. ఇప్పుడు ఈ అన్ని పనుల కోసం ఒకే ఒక యాప్ వచ్చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘RailOne’ (రైల్ వన్) అనే కొత్త సూపర్ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ యాప్ వల్ల ప్రయాణికులకు రైల్వే సేవలు మరింత సులభంగా మారనున్నాయి.
భారతీయ రైల్వే ఇప్పుడు తన అన్ని డిజిటల్ సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చింది. అదే ‘RailOne’ సూపర్ యాప్. ఈ యాప్‌ను CRIS (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) అనే సంస్థ తయారు చేసింది. ఇది IRCTCతో కలిసి పనిచేస్తుంది.
Read Also:Yash : ‘బాస్’ నంబర్ ప్లేట్.. రూ.3 కోట్ల లగ్జరీ కారు.. యశ్ రేంజే వేరు
RailOne యాప్‌లో ఏమేం చేయొచ్చంటే
* టికెట్ బుకింగ్: ఒకే చోట టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
* లైవ్ ట్రైన్ స్టేటస్: మీ ట్రైన్ ఎక్కడ ఉందో లైవ్‌గా చూడొచ్చు.
* ఫుడ్ ఆర్డర్: ట్రైన్లోనే మీకు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు.
* ప్లాట్‌ఫామ్ టికెట్: ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా దీని ద్వారా తీసుకోవచ్చు.
* ఫిర్యాదు నమోదు: ఏదైనా సమస్య వస్తే, యాప్ ద్వారానే ఫిర్యాదు కూడా చేయొచ్చు.
ఈ యాప్ ప్రస్తుతానికి టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే అందరికీ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లో అందుబాటులోకి వస్తుంది.
RailOne యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
యాప్ అందుబాటులోకి రాగానే మీ మొబైల్లో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి, ‘RailOne’ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. CRIS రూపొందించిన యాప్‌ను సెలక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని ఒక m-PIN సెట్ చేసుకోవాలి.
Read Also:Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?
RailOne వల్ల కలిగే లాభాలు
* అన్ని సేవలు ఒకే చోట: రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఒకే యాప్‌లో దొరుకుతాయి. వేరు వేరు యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
* సులభమైన వాడకం: టికెట్ బుకింగ్ నుంచి ఫిర్యాదు చేసే వరకు ప్రతి పని కొన్ని క్లిక్కులతోనే పూర్తవుతుంది.
* సేఫ్టీ : m-PIN, సురక్షితమైన లాగిన్ సిస్టమ్‌తో మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది.
* యూజర్ ఫ్రెండ్లీ డిజైన్: ప్రయాణికులు సులభంగా ఉపయోగించుకునేలా యాప్‌ను డిజైన్ చేశారు.
RailOne యాప్ IRCTC యాప్‌ను పూర్తిగా తొలగించదు. ఇది IRCTC కి ఒక ఎక్స్ ట్రా ఆప్షన్‌గా మాత్రమే వచ్చింది. IRCTC యాప్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే, రైల్ వన్ మీకు అన్ని ఇతర రైల్వే సేవలు ఒకే చోట లభిస్తాయి. భవిష్యత్తులో ఈ యాప్‌లో మెసేజింగ్, సోషల్ మీడియా, ఈ-కామర్స్, పేమెంట్ గేట్‌వే వంటి సేవలను కూడా యాడ్ చేస్తారట. ఇది ఒక పూర్తి స్థాయి డిజిటల్ ఎకోసిస్టమ్‌గా మారనుంది.
-
Indian Railways : రైల్వే టికెట్ బుక్ చేసుకునే విషయంలో గొప్ప గుడ్ న్యూస్ .. ఇక వెయిటింగ్ అక్కర్లేదు
-
Railway: రైల్వే ప్రయాణికులకు గొప్ప శుభవార్త
-
Railway: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. పెరగనున్న టికెట్ ధరలు
-
Kerala Tour Just 14000: కేరళ టూర్ జస్ట్ 14000.. ఎంజాయ్ చేయడానికి త్వరపడండి
-
Viral Video : రైలులో సీటు కోసం రచ్చ.. ప్రయాణీకుల మధ్య వాగ్వాదం