Viral Video : రైలులో సీటు కోసం రచ్చ.. ప్రయాణీకుల మధ్య వాగ్వాదం

Viral Video : ప్రయాణాలకు ఇప్పుడు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నా దూర ప్రయాణాలకు ఇప్పటికీ చాలామందికి రైలు ప్రయాణమే ఫస్ట్ ఆప్షన్. ఇది తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకోవడంలో సాయపడుతుంది. అయితే, రైలు ప్రయాణానికి కొన్ని రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకోని వారు జనరల్ కోచ్‌లలో ప్రయాణించాల్సి వస్తుంది. ఈ జనరల్ కోచ్‌లలో తరచుగా సీట్ల విషయంలో పెద్ద గొడవలు జరుగుతుంటాయి.
ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన జనరల్ బోగీలో సీటు దొరకడం అంత ఈజీ ఏం కాదు. ఒకసారి సీటు కోసం గొడవ మొదలైతే, అది అంత ఈజీగా ఆగదు. అలాంటి గొడవకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు సీటు కోసం వాదించుకుంటూ కనిపిస్తారు. ఈ వాదనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అది ఫాస్టుగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసేవాళ్లు విపరీతంగా షేర్ కూడా చేస్తున్నారు.
Read Also:Viral Video : పసికందుతో కింగ్ కోబ్రా ఆట.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Verbal-Kalesh b/w Passengers inside General Coach of Indian Railways: pic.twitter.com/SNTnDMhmyF
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 29, 2025
Read Also:Clocks: హోటల్ గదిలో గడియారాలు ఎందుకు ఉండవు.. ఎప్పుడైనా గమనించారా?
వైరల్ వీడియోలో ఏం జరిగింది?
ఈ వైరల్ వీడియో ఏదో ఒక జనరల్ కోచ్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బోగీ అంతా ప్రయాణికులతో నిండిపోయి ఉంది. అందులో ఒక వ్యక్తి హాయిగా సీటుపై పడుకుని ఉన్నాడు. అదే సమయంలో.. ఒక ప్రయాణికుడు వచ్చి అతడిని లేవమని కోరతాడు. దానికి ఆ పడుకున్న వ్యక్తి.. “నేను గత 36 గంటల నుంచి ప్రయాణిస్తున్నాను నేను లేవలేను” అని చెబుతాడు. అప్పుడు ఆ ప్రయాణికుడు.. “ఇదేమైనా రిజర్వేషన్ బోగీ కాదు కదా, మీరు హాయిగా సీటుపై పడుకోవడానికి? దయచేసి లేచి ఇతరులకు కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి” అని అంటాడు. దీని తర్వాత ఇద్దరి మధ్య సీటు విషయంలో పెద్ద వాగ్వాదం జరుగుతుంది.
సోషల్ మీడియాలో స్పందన
ఈ వీడియోను X (గతంలో ట్విట్టర్)లో ‘@gharkekalesh’ అనే అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియోను వేల మంది చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ “అయ్యా, జనరల్ కోచ్‌లో మీరు ఈ రద్దీ చూశారా” అని రాశాడు. ఇంకొకరు “వీడు ఎంత మూర్ఖుడు” అని కామెంట్ చేశారు. మరొక నెటిజన్ జనరల్ కోచ్‌లో ఇలాంటి గొడవలు చాలా కామన్ భయ్యా అని కామెంట్ చేశాడు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు