Clocks: హోటల్ గదిలో గడియారాలు ఎందుకు ఉండవు.. ఎప్పుడైనా గమనించారా?
Clocks in hotel rooms అందుకే చాలా మంది హోటల్ యాజమాన్యం గదుల్లో గడియారాలు ఉంచరు. అందంగా ఉండటానికి అన్నింటిని కూడా ఉంచుతారు. కానీ గడియారాలను మాత్రం అసలు ఉంచరు.

Clocks: సాధారణంగా బయటకు వెళ్లినప్పుడు గదులు అనేవి తీసుకుంటారు. ఎవరి స్తోమతను బట్టి వారు గదులు తీసుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా హోటల్ గదికి వెళ్లినప్పుడు గమనించారా? గోడపై గడియారం అసలు ఉండదు. నిజానికి విషయం చాలా మందికి తెలియదు. అసలు హోటల్ గదుల్లో గడియారాలు ఎందుకు లేవో 99 శాతం మందికి తెలియదు. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఈ విధంగా మీరు సమయాన్ని తెలుసుకుంటున్నారు. మరి మొబైల్స్ లేని వారి పరిస్థితి ఏంటి? అసలు హోటల్ గదుల్లో గడియారాలు ఎందుకు ఉండవు? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: సామాన్యులనే కాదు..బ్యాంకులనూ దోచేస్తున్న కేటుగాళ్లు..ఏడాదిలో 3రెట్లు పెరిగిన సైబర్ మోసాలు
హోటల్ గదుల్లో గడియారాలు లేకపోవడానికి పెద్ద కారణం లేకపోదు. అయితే హోటల్స్‌కు చాలా మంది వస్తుంటారు. పెద్ద వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు ఇలా అందరూ కూడా వస్తుంటారు. అయితే గడియారాలను ఉంచకపోవడం వల్ల అతిథులు సమయానికి సంబంధించిన ఒత్తిడి నుండి దూరంగా ఉంటారు. సమయం గురించి అతిగా ఆందోళన చెందకుండా ఉండటానికి హోటల్ యాజమాన్యం గదుల్లో గడియారాలను ఉంచదు. అతిథులు ఎటువంటి చింత లేకుండా విశ్రాంతి తీసుకొని తమ సమయాన్ని ఆస్వాదించడమే ఈ హోటల్ లక్ష్యం. అలాగే సమయం తెలియకపోవడం వల్ల ఎక్కువ సమయం వాటు వారు ఉంటారు. దీని వల్ల వారు ఆ హోటల్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటారు. అయితే హోటల్ గది లోపలి డిజైన్ బాగుంటుంది. అదే గడియారం ఉంటే శబ్దం వస్తుంది. దీనివల్ల వారికి ఇబ్బంది పెట్టడం ఎందుకని గడియారాలు పెట్టరు. సమయం తెలియకుండా ఉండటం వల్ల వారు హోటల్ గదుల్లో హ్యాపీగా కుటుంబంతో గడుపుతారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన అన్ని కూడా తగ్గుతాయి. దీంతో హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటారు. ఈ కారణం వల్లనే చాలా హోటల్స్‌లో ఎక్కువగా గడియారాలు ఉంచరు.
Read Also: జుట్టు రాలడం తగ్గి..నిగనిగలాడే జుట్టు కావాలంటే తులసితో ఈ టిప్స్ పాటించండి
చాలా మంది హోటల్‌కి కొంత సమయానికి మాత్రమే వెళ్తుంటారు. సమయం తెలిస్తే మళ్లీ వచ్చేస్తారు. అదే సమయం తెలియకపోవడం వల్ల ఎక్కువ సమయం పాటు ఉంటారు. దీనివల్ల హోటల్ వారికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఎక్కువ డబ్బులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అందుకే చాలా మంది హోటల్ యాజమాన్యం గదుల్లో గడియారాలు ఉంచరు. అందంగా ఉండటానికి అన్నింటిని కూడా ఉంచుతారు. కానీ గడియారాలను మాత్రం అసలు ఉంచరు.