Argue: ఇలాంటి వాళ్లతో వాదనలకి దిగడం మూర్కత్వమే
కొందరు వాదనలకు ఎక్కువగా దిగుతుంటారు. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడం జరిగితే.. ఎవరి ఒపీనియన్స్ వాళ్లకి ఉంటాయి. అయితే ఇలా ఏ విషయంపైన అయినా ఏదైనా డిస్కషన్ జరిగితే మాత్రం కొందరు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడతారు. మరికొందరు ఏం తెలియకుండా మాట్లాడతారు.

Argue: కొందరు వాదనలకు ఎక్కువగా దిగుతుంటారు. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడం జరిగితే.. ఎవరి ఒపీనియన్స్ వాళ్లకి ఉంటాయి. అయితే ఇలా ఏ విషయంపైన అయినా ఏదైనా డిస్కషన్ జరిగితే మాత్రం కొందరు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడతారు. మరికొందరు ఏం తెలియకుండా మాట్లాడతారు. మరికొందరు తెలిసి తెలియనట్లు మాట్లాడుతుంటారు. కొన్ని సమయాల్లో చిన్న డిస్కషన్స్ చివరకు వాదనల వరకు వెళ్తుంటాయి. ఎప్పుడైనా ఎవరితో అయినా వాదించేటప్పుడు ముందు చూసుకోవాలి. అంటే మీరు వాదించే పర్సన్‌కి అన్ని విషయాలు తెలుసా? లేదా? అనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు డిస్కస్ చేసే దాని గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలిసిన వారితో అయినా మాట్లాడవచ్చు. అదే పూర్తిగా తెలియని వారితో అయినా కూడా వాదనలు పెట్టుకోవచ్చు. కానీ సగం తెలిసి, తెలియని వారితో వాదనలు పెట్టుకోవడం సమయం వృథా. ఎందుకంటే వీరికి సగం తెలియడం వల్ల మీతో తప్పుడు వాదనలకు దిగుతారు. వారు చెప్పిందే రైట్ అనే ఫీలింగ్‌లో ఉంటారు. దీనివల్ల ఇతరులు చెప్పినది అసలు వినరు. దీంతో పాటు వారి మాట మీదే నిలబడి ఉండటంతో ఇతరులను పట్టించుకోరు. అయితే ఇలా తెలిసి తెలియని వారితో వాదన పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు.
Read Also: తవ్వకాల్లో బయటపడ్డ వింత… కూర్చున్న భంగిమలో 1000ఏళ్ల నాటి సమాధి బాబా
ఎప్పుడైనా ఎవరితో అయినా వాదనలు పెట్టుకుంటే మాత్రం సగం తెలిసి తెలియని వారితో పెట్టుకోకూడదు. ఏం తెలియని వారితో వాదనలు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. వీరికి ఏం తెలియనప్పుడు మీరు వీరి నుంచి ఏం నేర్చుకోలేరు. అయితే వాదనలు పెట్టుకున్నప్పుడు అన్ని విషయాలు తెలిసిన వారితోనే పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే వీరి వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి. వాదనల వల్ల మనకి తెలియని చాలా విషయాలను నేర్చుకోవచ్చు. ఎవరికీ కూడా అన్ని విషయాలు తెలియవు. కొందరికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి. మీకు తెలిసినవి ఇతరులకు తెలియకపోవచ్చు. ఇతరులకు తెలిసినవి మీకు తెలియకపోవచ్చు. ఇలా మీకు తెలియనివి, ఇతరులకు తెలిసిన విషయాలను ఈ వాదనలు ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మీరు వాదనలు పెట్టుకుంటే ముందు వారిని అంచనా వేయండి. వారు ఎలాంటి వారు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయనే విషయాలు అన్ని కూడా తెలుసుకోండి. అన్ని విషయాలు తెలిసిన వారితో వాదనలు పెట్టుకోవడం వల్ల మీకు కాస్త జ్ఞానం వస్తుంది. అదే ఏం రాని వారితో వాదనలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని కొందరు నిపుణులు అంటున్నారు.