Shopping malls : షాపింగ్ మాల్స్ కు కిటికీలు ఎందుకు ఉండవంటే?

Shopping malls :
మీరు షాపింగ్ మాల్స్ కు చాలాసార్లు వెళ్లే ఉంటారు. కొన్నిసార్లు షాపింగ్ కోసం, కొన్నిసార్లు స్నేహితులతో గడపడానికి, కొన్ని సార్లు సరదా కోసం, కొన్ని సార్లు టైమ్ పాస్ కోసం మొత్తం మీద షాపింగ్ మాల్ కు అయితే చాలా మంది వెళ్లే ఉంటారు కదా. అయితే ఈ షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు కిటికీలు లేవని మీరు ఎప్పుడైనా గమనించారా? అవును నిజమే షాపింగ్ మాల్స్ కు కిటికీలు ఉండవు. మరి ఎందుకు? దీని వెనుక కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి కిటికీలు వెంటిలేషన్ కోసం లేదా బయటి దృశ్యాన్ని చూడటానికి చాలా మంది అమరుస్తుంటారు. అయితే షాపింగ్ మాల్స్‌లో ఒక్క కిటికీ కూడా కనిపించకపోవడానికి కారణం ఏమిటి? ఇది చాలా మంది మనసుల్లో తలెత్తే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, మనం చరిత్రలోకి కొంచెం వెళ్లి, మాల్ రూపకల్పన వెనుక దాగి ఉన్న మానసిక కారణాలను అర్థం చేసుకోవాలి. మరి అవేంటంటే?
సమయం తెలియదు
అమెరికాలో మాల్స్ ట్రెండ్ ప్రారంభమైనప్పుడు, కిటికీలు లేకుండా వాటిని నిర్మించే ట్రెండ్ ప్రారంభమైంది. ఈ డిజైన్ వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. మాల్ డిజైన్ ఎంతగా ఉందంటే అక్కడ సమయం ఎంత అవుతుంది? అనేది మనసులోకి రానే రాదు. సమయం గుర్తు కూడా ఉండేది కాదట. ఇక బయటి దృశ్యాన్ని చూడలేకపోవడం వల్ల సమయాన్ని తెలిసేది కాదు. లోపల వెలుతురు, సందడి చూస్తే, నిజంగానే సాయంత్రం అయినా, ఇంకా పగటిపూట ఉన్నట్లే అనిపిస్తుంది. దీనివల్ల ప్రజలు మాల్‌లో ఎక్కువ సమయం గడపడానికి, ఎక్కువ షాపింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
కిటికీలు లేకపోవడానికి గల మానసిక కారణాలు
సమయస్ఫూర్తిని కోల్పోవడం – కిటికీలు లేకుండా, సహజ వెలుతురు ఉండదు. బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇది సమయ స్పృహను మసకబారిస్తుంది. ప్రజలు మాల్‌లో ఎంత సమయం గడుపుతున్నారో తెలియకుండానే షాపింగ్ లో బిజీ అవుతుంటారు.
దృష్టిని పెంచడం – కిటికీల నుంచి వచ్చే వీక్షణలు కస్టమర్ల దృష్టిని మరల్చగలవు. కిటికీలు లేకపోవడం వల్ల, షాపింగ్ పై దృష్టి పెడుతుంటారు. కస్టమర్లు ఎక్కువగా షాపింగ్ చేయమని ప్రోత్సహిస్తారు. కిటికీలు లేకుండా, మాల్ పరిమాణం, ఆకారం చాలా గందరగోళంగా అనిపిస్తుంది. దాని ముగింపు ఎక్కడ ఉందో చెప్పడం కష్టం. ఇది కస్టమర్లకు ఇంకా చాలా చూడాల్సి ఉందనే భావనను అందిస్తుంది.
వాతావరణ నియంత్రణ: కిటికీలు లేనప్పుడు, మాల్ లోపల ఉష్ణోగ్రత, వెలుతురు, ధ్వనిని తెలుసుకోవడం కూడా కష్టమే. ఇది వినియోగదారులకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడంలో సహాయపడుతుంది. వర్షం పడుతుందో తెలియదు. ఎండా చలి గురించి వారికి పెద్ద అవగాహన ఉండదు. సో భయం లేకుండా షాపింగ్ చేస్తారు. బయటకు వెళ్తే గానీ పరిస్థితి తెలియదు కదా.
ఇంకా చాలా కారణాలు ఉన్నాయి…
మరిన్ని దుకాణాలు – కిటికీలు లేకుండా, గోడలను ఎక్కువగా ఉపయోగించవచ్చు. మరిన్ని దుకాణాలు, ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయవచ్చు. కిటికీల ద్వారా వేడి, చలి పోతుంది. కిటికీలు లేకపోవడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. కిటికీలు దొంగలకు ప్రవేశ కేంద్రాలుగా మారవచ్చు. కిటికీలు లేకపోవడం ద్వారా ఈ ప్రమాదం తగ్గుతుంది. భద్రత పెరుగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.