Hero Ram Pothineni: టాలీవుడ్ హీరోకి చుక్కలు చూపించిన మందు బాబులు.. అసలేమైందంటే?

Hero Ram Pothineni: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేం పి. మహేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయగా.. అదిరిపోయింది. ఈ చిత్రంలో రామ్ ఓ ఫ్యాన్‌గా కనిపించబోతున్నాడు. ఉపేంద్రకు డై హార్డ్ ఫ్యాన్‌గా సినిమాలో నటించబోతున్నాడు. సినిమా ఫస్ట్ గ్లింప్స్ అయితే సూపర్‌గా అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ రాజమండ్రిలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ షెరటాన్‌లో ఉంటున్నాడు.
ఈ సమయంలో ఒక ఇద్దరు అనుమానితులు హోటల్ గదిలోకి ప్రవేశించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వెళ్లి.. హీరో టీమ్‌కి చెందిన వాళ్లమని చెప్పారు. తమకు లిఫ్ట్ యాక్సెస్ కావాలని అడిగారు. దీంతో హోటల్ సిబ్బంది వీఐపీ గెస్ట్‌గా ఆరో ఫ్లోర్‌లో ఉంటున్న రామ్ రూమ్ వరకు లిఫ్ట్ ఇచ్చారు. దీంతో వారిద్దరూ వెళ్లి హౌస్ కీపింగ్ సిబ్బందిని మాటల్లో మరిచి కీ తీసుకుని గదిలోకి వెళ్లారు. ఈ సమయానికే రామ్ నిద్రపోయారు. ఆ ఇద్దరు అనుమానితులు తలుపులు కొట్టడంతో రామ్‌కి డౌట్ వచ్చి తన టీమ్‌కు కాల్ చేశారు. వారు హోటల్ మేనేజ్‌మెంట్‌కు చెప్పడంతో వారు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరు మద్యం సేవించడం వల్ల ఇలా రామ్‌ను డిస్టర్బ్ చేసినట్లు గుర్తించారు.
హోటల్ యాజమాన్యంను బురిడి కొట్టించి ఆ ఇద్దరు అనుమానితులు ఎందుకు వెళ్లారని పోలీసులు విచారిస్తున్నారు. వీరు అభిమానంతో వెళ్లారా? లేకపోతే ఇంకా ఏదైనా ఉద్దేశంతో వెళ్లారా? అనే విధంగా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు హీరోకి భద్రత లేకుండా ఇలా ఎలా అని అంటున్నారు. ఈ ఘటనతో మూవీ టీం భద్రతపై నిఘా పెట్టింది. సినీ సెలబ్రిటీలు ఉండే దగ్గర ఇలా చేయడం వల్ల భద్రతలో ఇబ్బంది వస్తుంది. ఈ సంఘటన వల్ల ఇకపై సెలబ్రిటీల విషయంలో భద్రతా టీం జాగ్రత్తలు పాటిస్తుంది. ఇకపై రామ్ మూవీ టీం కూడా కాస్త భద్రతా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంది.
ఇది కూడా చూడండి: Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?