Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?

Thammudu : యంగ్ స్టార్ హీరో నితిన్ కొత్త సినిమా తమ్ముడు మీద అంచనాలు మామూలుగా లేవు. ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తీసిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రచ్చ చేస్తోంది. జూలై 4న సినిమా రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఇంకో కొత్త ట్రైలర్‌ను వదిలింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ ట్రైలర్ లో ఏముంది? సినిమా ఎలా ఉండబోతోంది? వివరంగా చూద్దాం.
నితిన్, సెన్సిబుల్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ టైటిల్ తో వచ్చిన సినిమా తమ్ముడు మీద అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదల అయిన ట్రైలర్ చూస్తుంటే, సినిమా చాలా ఎమోషనల్‌గా, యాక్షన్ ఎలిమెంట్స్‌తో నిండిపోయి ఉంటుందని అర్థమవుతోంది. కాకపోతే పాత కథే కాబట్టి ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టకుంటుందో చూడాలి. నాటి కథలు నేటి తరానికి ఎంతవరకు క్లిక్ అవుతాయో చూడాలి. నితిన్ ఇందులో తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా కనిపించనున్నాడు. ఒకప్పటి హీరోయిన్ లయ ఈ సినిమాతో మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తూ నితిన్‌కి అక్కగా నటిస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాశిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read Also:Dil Raju : దిల్ రాజుకు ‘గేమ్ చేంజర్’ దెబ్బ.. ఏకంగా రూ.100 కోట్లు లాస్.. ఎలా కవర్ చేశాడంటే ?
ట్రైలర్ ప్రకారం, నితిన్ అక్క ఆపదలో ఉందని తెలిసిన క్షణం నుంచే అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే ఈ సినిమా కథలో అసలు హైపాయింట్ అని తెలుస్తోంది. బలమైన డైలాగ్స్, పక్కా యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నితిన్ ఈ పాత్రలో చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్‌గా సౌరబ్ సచ్‌దేవా అగ్రెసివ్‌గా కనిపించి సినిమాకు మరింత టెన్షన్‌ను తీసుకొచ్చారు. ట్రైలర్లో ఆయన బాడీ లాంగ్వేజ్, క్రూరత్వం ప్రేక్షకులను బాగా ప్రభావితం చేస్తాయనిపిస్తోంది.
ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ అజనీష్ లోకనాథ్ సంగీతం. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్ళింది. థియేటర్లో ఈ మ్యూజిక్ ప్రేక్షకులను ఒక ఎమోషనల్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుందని అంటున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, రెండు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు సమర్పణలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. కాగా, ఈ సినిమా జూలై 4న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా నితిన్‌కి మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి!
Read Also:Motorola : రూ.15వేలకే అదిరిపోయే ఫీచర్స్.. మోటోరోలా కొత్త ఫోన్ వచ్చేస్తోంది
-
Dil Raju : దిల్ రాజుకు ‘గేమ్ చేంజర్’ దెబ్బ.. ఏకంగా రూ.100 కోట్లు లాస్.. ఎలా కవర్ చేశాడంటే ?
-
Sapthami Gowda : నితిన్ సినిమాలో కాంతారా బ్యూటీ ఉండేది అంత సేపేనా.. ఫస్ట్ సినిమానే షాక్
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
Nithin Thammudu Movie Trailer: నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. వీడియోపై ఓ లుక్కేయండి
-
Balayya Rejected Laya: షూటింగ్ మొదటి రోజే లయను వద్దు అనేసిన బాలయ్య.. విషయాలు బయటపెట్టిన లయ