Dil Raju: తమిళ హీరోలను చూసి తెలుగు హీరోలు నేర్చుకోవాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు

Dil raju: తెలుగు నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ఏడాది అసలు దిల్ రాజుకు సరిగ్గా కలిసి రావడం లేదు. ఒక సినిమా హిట్ అయితే లాభం వచ్చిందని అనుకునే లోపే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని తీశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కలెక్షన్లు కూడా రాలేదు. దీంతో పాటు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇటీవల విడుదలైన ‘తమ్ముడు’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా హిట్ అవుతుందని భావించినా కూడా ఫ్లాప్ అయ్యింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీకి కేవలం రూ.3 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఎంత పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ వల్ల ఒక రూ.30 కోట్లు వరకు రికవరీ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వచ్చిన లాభాలు అన్ని కూడా ఈ తమ్ముడు మూవీతో నష్టపోయారు. అయితే ఇటీవల తమ్ముడు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్ రాజు తమిళ హీరో విజయ్‌ని తెలుగు హీరోలతో పోల్చి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమిళ హీరో విజయ్‌తో కూడా సినిమాను చేశాను.. వారిసు అనే చిత్రం తమిళలంలో విడుదల కాగా, దాన్ని తెలుగులో వారసుడుగా విడుదల చేశామని దిల్ రాజు అన్నారు. ఈ సినిమా తెలుగులో బాగా హిట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే అందరూ తమిళ హీరో విజయ్ తమకు నెలకు 20 రోజులు షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చేవారని తెలిపారు. అయితే ఈ సినిమా పూర్తి చేయడానికి కేవలం 120 రోజులు మాత్రమే పట్టిందని తమ్ముడు ప్రమోషన్స్‌లో తెలిపారు. అయితే విజయ్‌తో తెలుగు హీరోలను పోల్చారు. ప్రతీ తెలుగు స్టార్ హీరో కూడా ఇలానే పాటిస్తే బాగుంటుంది.
షూటింగ్ విషయంలో ఇలా మాకు కొన్ని రోజులు డేట్స్ ఇస్తే సినిమా తొందరగా పూర్తి అవుతుంది. షూటింగ్ డేట్స్ ఎప్పుడు ఇస్తారని మన తెలుగు హీరోలు ముందే చెప్పేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని దిల్ రాజు అన్నారు. అయితే తెలుగు హీరోలు ఆరు నెలల ముందు డేట్స్ కూడా చెప్పరు. దీనివల్ల షూటింగ్‌లో మాకు ఒత్తిడి పెరుగుతుంది. అదే ముందు చెబితే ఇంత ఒత్తిడి తీసుకోమని తెలిపారు. దీనివల్ల రిలీజ్ చేయాల్సిన సమయానికి సినిమా పూర్తి అవుతుంది. ప్రేక్షకులు కూడా అభిమాన హీరో సినిమా ఎంత తొందరగా అయితే అంత తొందరగా చూడాలని అనుకుంటారని అన్నారు. ముందుగానే డేట్స్ ఇవ్వడం వల్ల నిర్మాత, దర్శకుడు, ప్రతీ టెక్నీషియన్ కూడా వారి పనిని పూర్తి చేసి కష్టపడతారు. కానీ ఇలాంటి విధానం టాలీవుడ్‌లో లేదు. ఇలా ఉంటేనే సినిమాలు అన్ని కూడా సరైన సమయానికి వస్తాయని నిర్మాత దిల్ రాజు ఇటీవల తమ్ముడు మూవీ ప్రమోషన్స్‌లో అన్నారు.
Also read : Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?
-
Dil Raju : దిల్ రాజుకు ‘గేమ్ చేంజర్’ దెబ్బ.. ఏకంగా రూ.100 కోట్లు లాస్.. ఎలా కవర్ చేశాడంటే ?
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
Ram Charan: రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ తియ్యబోతున్న నెట్ ఫ్లిక్స్..మరో అరుదైన గౌరవం!
-
Ram Charan : రామ్ చరణ్ డ్యాన్స్ తగ్గుతుందా..? దానికి కారణం ఇదేనా..?