Ram Charan : రామ్ చరణ్ డ్యాన్స్ తగ్గుతుందా..? దానికి కారణం ఇదేనా..?

Ram Charan :
యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి చాలా మంచి గుర్తింపైతే ఏర్పడింది. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి ఎవరికి వారు వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ భారీ విజయాలను సాధిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రి లో నెంబర్ వన్ పొజిషన్ ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు…మరి ఇందులో ఎవరు నెంబర్ వన్ పొజిషన్ ను సంపాదించుకుంటారనేది తెలియాల్సి ఉంది…
చిరుత(Chirutha) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన రామ్ చరణ్ తనదైన రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ కి వచ్చినప్పటికి మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమాతోనే డాన్సర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్టెప్పులను వేస్తూ మెగాస్టార్ చిరంజీవి తనయుడు అనిపించుకున్నాడు. నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో డాన్సులతో గాని, ఫైట్లతో గాని ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. ఇక ఎప్పుడైతే రంగస్థలం సినిమా వచ్చిందో అప్పటి నుంచి ఆయన డాన్సులకు పెద్దగా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చినట్టుగా కనిపించడం లేదు. మొత్తం యాక్టింగ్ మీదే తన ఫోకస్ ని కేటాయించాడు. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ అంటే డాన్స్ లకి పెట్టింది పేరుగా పిలుస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది డ్యాన్సర్లలో తను కూడా ఒకడిగా కొనసాగుతున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎందుకు ఆయన సినిమాల్లో భారీ స్టెప్పులు వేయడం లేదు. ఇంతకుముందులా ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పటికి డాన్స్ పరంగా మాత్రం ఆయన చాలా వరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఇక ఇదంతా చూసిన సినిమా మేధావులు సైతం రామ్ చరణ్ ప్రస్తుతం యాక్టింగ్ మీద ఫోకస్ చేసి డాన్స్ లకు పెద్దగా ప్రఫరెన్స్ అయితే ఇవ్వడం లేదని చెబుతున్నారు.
ఇక డాన్సులు బాగా వేసినప్పటికి యాక్టింగ్ ఎలివేట్ అవ్వడం లేదు. కేవలం డాన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారనే ఉద్దేశ్యంతో ఆయన అలా చేసి ఉండవచ్చు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించిన ఆయన తన తదుపరి సినిమాలతో భారీ విజయాలను సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం బుచ్చిబాబు (Buchhibabu) డైరెక్షన్ లో సినిమా చేస్తున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాలతో మాత్రం మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా చేసిన గేమ్ చేంజర్ సినిమాతో చాలా వరకు వెనుకబడిపోయినప్పటికి తర్వాత వచ్చే సినిమాలతో భారీ విజయాలను అందుకొని కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు…
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Mega 157: అనిల్ రావిపూడి చిరంజీవి మూవీ నుంచి వీడియో రిలీజ్ వైరల్
-
Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…
-
Vishwambhara: విశ్వంభరలో సందడి చేయనున్న మెగా డాటర్.. మాములుగా ఉండదుగా.. మెగా ఫ్యాన్స్కి పండగే