Dil Raju : దిల్ రాజుకు ‘గేమ్ చేంజర్’ దెబ్బ.. ఏకంగా రూ.100 కోట్లు లాస్.. ఎలా కవర్ చేశాడంటే ?

Dil Raju : గేమ్ చేంజర్ సినిమాతో నిర్మాత దిల్ రాజుకు పెద్ద షాక్ తగిలింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా నష్టం వచ్చిందని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. రామ్ చరణ్, కియారా అద్వానీ, శంకర్ లాంటి పెద్ద పెద్ద పేర్లు ఉన్నా కూడా సినిమా ఎందుకు దెబ్బతింది? మరి ఈ నష్టాన్ని దిల్ రాజు ఎలా పూడ్చుకున్నాడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా దిల్ రాజుకి చాలా పెద్ద నష్టాన్ని మిగిల్చిందట. ఈ సినిమా మొదట ప్రకటించినప్పుడు జనాల్లో చాలా అంచనాలు ఉండేవి. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు షూటింగ్ జరిగింది. కానీ, సినిమా విడుదలై ప్లాప్ అయిందని దిల్ రాజు ఒప్పుకున్నాడు. సినిమాపై వచ్చిన నెగటివ్ టాక్ పెద్ద నష్టానికి కారణమైంది. వంద కోట్ల రూపాయలకు పైగానే నష్టం వచ్చిందని చెబుతున్నారు.
Read Also:Rishabh Pant Backflip: బ్యాక్ఫ్లిప్ నీకంత అవసరమా.. రిషబ్ పంత్కు డాక్టర్ క్లాస్
దిల్ రాజు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తాడు. నష్టపోకుండా చూసుకుంటాడని పేరుంది. కానీ ఈ సినిమాతో మాత్రం దెబ్బతిన్నాడు. సినిమా చూడగానే ఇది పెద్దగా ఆడదని దిల్ రాజుకు అర్థమైందట. అందుకే ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి ఆయన ముందుగానే మానసికంగా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సంక్రాంతికి విడుదల అయ్యింది. విచిత్రం ఏంటంటే, అదే సమయంలో దిల్ రాజు బ్యానర్లోనే తీసిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాను మాత్రం జనం చాలా బాగా ఇష్టపడ్డారు. అది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి వచ్చిన లాభాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేశాడు. ఎందుకంటే, ‘గేమ్ చేంజర్’ ను డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు నష్టపోయారు. ఆ నష్టాన్ని దిల్ రాజు తన లాభంతో భర్తీ చేశాడు. దీనితో దిల్ రాజు అందరి మన్ననలు పొందాడు. గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాంని కూడా రిలీజ్ చేయడానికి రామ్ చరణ్, చిరంజీవి ఒప్పుకున్నారట. ఈ విషయంలో దిల్ రాజు వాళ్ళిద్దరికీ థాంక్స్ చెప్పాడు. మొత్తానికి, ఒక సినిమాతో నష్టపోయినా, మరో సినిమాతో దిల్ రాజు అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నాడు.
Read Also:Rishabh Pant Backflip: బ్యాక్ఫ్లిప్ నీకంత అవసరమా.. రిషబ్ పంత్కు డాక్టర్ క్లాస్
-
Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
Ram Charan: రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ తియ్యబోతున్న నెట్ ఫ్లిక్స్..మరో అరుదైన గౌరవం!
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Ram Charan : రామ్ చరణ్ డ్యాన్స్ తగ్గుతుందా..? దానికి కారణం ఇదేనా..?