Rishabh Pant Backflip: బ్యాక్‌ఫ్లిప్ నీకంత అవసరమా.. రిషబ్ పంత్‌కు డాక్టర్ క్లాస్

Rishabh Pant Backflip: రిషబ్ పంత్ భారత క్రికెట్ టీమ్ లో ఓ స్టార్ ప్లేయర్. 2022 డిసెంబర్లో పంత్కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అది చూసి క్రికెట్ అభిమానులందరూ షాక్ అయ్యారు. చాలా మంది ఇక పంత్ క్రికెట్ ఆడలేడని అనుకున్నారు. కానీ పంత్ అస్సలు తగ్గలేదు.. అంత పెద్ద గాయాలు అయినా కూడా, తన నమ్మకంతో, పట్టుదలతో కష్టపడి వ్యాయామం చేశాడు. 21 నెలలు కష్టపడి, మళ్ళీ క్రికెట్ గ్రౌండ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అదరగొడుతున్నాడు.
పంత్కి ఆపరేషన్ చేసిన డాక్టర్ దిన్షా పార్దివాలా కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు. “పంత్ బతికి బయటపడటమే చాలా అదృష్టం” అని డాక్టర్ అన్నాడు. “యాక్సిడెంట్ తర్వాత పంత్‌ని ఆసుపత్రికి తెచ్చినప్పుడు, అతని కుడి మోకాలు పూర్తిగా విరిగిపోయింది. కుడి కాలి చీలమండ పైన కూడా గాయాలున్నాయి. కార్ అద్దాలు పగిలిపోయి, అతని వీపు మీద కూడా చాలా గాయాలయ్యాయి” అని డాక్టర్ చెప్పాడు.
Read Also:Mango Peel : తొక్కే కదా తీసేస్తున్నారా.. మామిడి తొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకవుతారు
🚨Rishabh Pant should not do somersault celebration🚨
Dr Dinshaw Pardiwala (Rishabh Pant's Surgeon) said –
Rishabh Pant's somersault celebration unnecessary, given the potential risks associated with his recovery. He was incredibly lucky to survive and that his recovery was… pic.twitter.com/faseSzV9Gt
— Satish Mishra 🇮🇳 (@SATISHMISH78) June 30, 2025
పంత్‌ని ఆసుపత్రికి తెచ్చినప్పుడు డాక్టర్ని నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా అని అడిగినట్లు తెలిపారు. అప్పుడు పంత్ తల్లి కూడా “నా కొడుకు మళ్ళీ నడవగలడా?” అని డాక్టర్ ను అడిగిందట. యాక్సిడెంట్ అయిన తర్వాత పంత్ చేతులు కూడా కదపలేకపోయాడు. కనీసం తనంతట తాను పళ్ళు కూడా తోముకోలేకపోయాడట. అంత దారుణంగా ఉంది అప్పుడు అతని పరిస్థితి. కానీ, పంత్ మెల్లగా నడవడం మొదలుపెట్టాక, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి అక్కడ కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాతే మళ్ళీ క్రికెట్లోకి వచ్చి ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు.
పంత్ సెంచరీ కొట్టినప్పుడల్లా చేసే ఆ బ్యాక్‌ఫ్లిప్ సెలబ్రేషన్స్ గురించి డాక్టర్ పార్దివాలా మాట్లాడుతూ.. “పంత్ జిమ్నాస్టిక్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అతను అందులో బాగా నిపుణుడు. అందుకే సెంచరీ కొట్టాక అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కానీ, అది బాగున్నా సరే, ఇది కొంచెం అనవసరం” అని డాక్టర్ చిన్న హెచ్చరిక చేశాడు. మళ్ళీ ఏదైనా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అతని ఉద్దేశ్యం కావచ్చు.
Read Also:July 1st Rules: జూలై 1 నుంచి మారనున్న రూల్స్.. తప్పకుండా తెలుసుకోండి
-
Chris Woakes Apologises Rishabh Pant: పంత్ కు సారీ చెప్పిన క్రిస్ వోక్స్.. గిల్ గురించి ఏమన్నాడంటే
-
Rishabh Pant: దేశం కోసం గెలవండి.. రిషబ్ పంత్ ఆసక్తికర ట్వీట్
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి
-
Rishabh Pant Injury: పంత్ పై రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్