Mango Peel : తొక్కే కదా తీసేస్తున్నారా.. మామిడి తొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకవుతారు

Mango Peel : ఇది వర్షాకాలం నుంచి వేసవికాలం మారే సమయం కదా. అందుకే వాతావరణం కూడా వేడిగా, చల్లగా మారుతూ ఉంటుంది. ఈ వాతావరణ మార్పు వల్ల చర్మం, జుట్టుకు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అందరినీ వేధించే సమస్యలు జుట్టు రాలడం, చుండ్రు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తలపై ఫంగస్ సులభంగా పెరిగి, చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది. ఇది తలపై దురదను కలిగించడమే కాకుండా, జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కెమికల్ షాంపూల కంటే ఇంట్లో దొరికే సహజ పద్ధతులను వాడటం చాలా ప్రభావవంతంగా, సురక్షితంగా ఉంటుంది. వర్షాకాలంలో చుండ్రును మొదలంటా పోగొట్టడానికి సహాయపడే మామిడి పండ్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో మామిడికాయ గుజ్జు తిన్న తర్వాత చాలా మంది తొక్కలను, గింజలను పారేస్తారు. కానీ, వాటి ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. మామిడిపండు ఎంత మంచిదో, దాని తొక్కకు కూడా అంతే లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టుకు, చర్మానికి, అంటే అందానికి, ఇది చాలా అద్భుతాలు చేయగలదు. మామిడి తొక్కలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
Read Also : July 1st Rules: జూలై 1 నుంచి మారనున్న రూల్స్.. తప్పకుండా తెలుసుకోండి
మామిడి తొక్కల నుంచి తీసిన నూనె మీ జుట్టును బలంగా చేయడమే కాకుండా, చుండ్రును తొలగిస్తుంది. జుట్టు తెగిపోకుండా ఆపుతుంది. దీన్ని మీ తలకు రాసుకోవడం వల్ల మీ జుట్టు నల్లగా, మెరిసేలా చేస్తుంది.
మామిడికాయ తిన్న తర్వాత దానిని పారవేయకుండా, జాగ్రత్తగా దానిని తెరిచి లోపల ఉన్న గింజను తీయండి. ఇప్పుడు ఈ గింజను ఎండబెట్టి పొడిలా చేసుకోండి. ఈ పొడికి 2 టీస్పూన్ల పెరుగు కలిపి మీ జుట్టుకు, ముఖ్యంగా కుదుళ్లకు పూయండి. జుట్టు రాలడానికి సంబంధించిన అన్ని సమస్యలు దీనివల్ల పరిష్కారమవుతాయి. ఈ మామిడి జీడులలో కూడా కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని వాడటం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుద పెరుగుతుంది.
Read Also :Tibetan prayer flags: బైక్కు ఈ రంగుల జెండా ఎందుకు కడతారో మీకు తెలుసా?
మామిడి జీళ్లు కూడా చుండ్రు సమస్యలో కూడా చాలా బాగా పనిచేస్తాయి. మంచి ఫలితాల కోసం, మీరు మామిడి జీడీల పొడిని నూనెతో కలిపి కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మామిడికాయల సీజన్ అయిపోయిందనుకుంటే మామిడికాయకు బదులుగా పెరుగు, నిమ్మకాయను ఉపయోగించవచ్చు. అర కప్పు పెరుగును ఒక నిమ్మకాయ రసంతో కలిపి మీ తల కుదుళ్లపై రాయండి. పెరుగు తల చర్మాన్ని చల్లబరుస్తుంది, నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని మీ జుట్టుకు అప్లై చేసిన తర్వాత, తేలికపాటి షాంపూ ఉపయోగించి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ తలపై ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది.
-
Tulsi Benefits : జుట్టు రాలడం తగ్గి..నిగనిగలాడే జుట్టు కావాలంటే తులసితో ఈ టిప్స్ పాటించండి
-
Hair Dye : హెయిర్ డై సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు నల్లగా ఉండాలంటే ఇలా చేయండి
-
Summer Skincare : వేసవిలో నల్లగా మారిన చేతులు మిలమిలా మెరవాలా.. ఈ 5 చిట్కాలు పాటించండి
-
Dark Spots : ఈ 5 ఇంటి చిట్కాలు ట్రై చేయండి..వేసవిలో నల్ల మచ్చలకు చెక్ పెట్టండి
-
Ant Control Tips : ఇంట్లో చీమల బెడద ఉందా?.. రూ.5తో శాశ్వతంగా చెక్ పెట్టేయండి
-
Giloy for Hair : జుట్టు ఊడటం తగ్గాలంటే.. ఈ ఒక్కటి నీళ్లలో వేసి తలస్నానం చేయండి