Tibetan prayer flags: బైక్‌కు ఈ రంగుల జెండా ఎందుకు కడతారో మీకు తెలుసా?

Tibetan prayer flags: రకరకాల బైక్‌లు అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ డబ్బులు దాచి పెట్టి వారికి నచ్చిన బైక్‌లు కొనుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్బాయిలకు బైక్‌లు అంటే ఒక ఎమోషన్. ఎంతో ఇష్టంగా కొన్న బైక్‌ను అబ్బాయిలు చాలా జాగ్రత్తగా వాడుతుంటారు. అసలు దానిపై ఒక్క మచ్చ కూడా పడకుండా చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో అయితే బైక్‌లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాస్త ఫ్యాషన్‌గా ఉండాలని ఎన్నో రకాల డిజైన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అబ్బాయిలు బైక్‌లకు రంగుల జెండా వంటివి పెడుతున్నారు. ఎక్కువగా టూరిస్ట్‌లు లాంగ్ డ్రైవ్‌కి వెళ్లే వారు బైక్‌లకు రంగుల జెండాలను పెడుతున్నారు. ఎక్కువగా ఐదు రంగుల జెండాలను తరచుగా చూస్తున్నాం. అయితే ఈ ఐదు రంగుల జెండాల అర్థం ఏంటి? ఎందుకు వీటిని ఎక్కువగా పెడుతున్నారు? పూర్తి వివరాలు కూడా ఈస్టోరీలో చూద్దాం.
పర్వత ప్రాంతాలు లేహ్-లడఖ్‌కు వెళ్లే వారు చాలా మంది ప్రజలు తమ బైక్‌లపై లేదా కారు వెనుక కిటికీలో ఆ రంగురంగుల జెండాను పెడుతున్నారు. కేవలం లాంగ్ జర్నీకి వెళ్లే వారు కాకుండా అందరూ కూడా పెడుతున్నారు. అయితే ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాదు.. దీని వెనుక ఓ కారణం ఉందట. ఈ జెండాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్నాయి. అవి బౌద్ధమత సంప్రదాయాన్ని సూచిస్తాయి. శాంతి, కరుణ, బలం, జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ జెండాలను రెండు రూపాల్లో లంగ్ టా (గాలి గుర్రం), దార్చోగ్ (నిలువు జెండా) చూడవచ్చు. వీటిలో మొత్తం ఐదు రంగులు ఉన్నాయి. ఈ టిబెటన్ జెండాలు బౌద్ధ సంప్రదాయం, మత విశ్వాసం, ప్రకృతి పట్ల గౌరవానికి చిహ్నం. ఈ ఐదు రంగుల జెండాలపై ఐదు చిహ్నాలు ఉంటాయి.
ఈ జెండాల్లో నీలం, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఉంటుంది. అయితే ప్రతి రంగు ఒక మూలకం, దిశను సూచిస్తుంది. నీలం ఆకాశం, తూర్పును సూచిస్తుంది. తెలుపు గాలి, పశ్చిమాన్ని సూచిస్తుంది. ఎరుపు అగ్ని, దక్షిణాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ నీరు, ఉత్తరాన్ని సూచిస్తుంది. పసుపు భూమి, కేంద్రాన్ని సూచిస్తుంది. ఈ ఐదు రంగులు కూడా ప్రకృతి సమతుల్యతను, కరుణ, జ్ఞానం, సామరస్యం, దయ, పరిపూర్ణ జ్ఞానం బౌద్ధమతం ఐదు జ్ఞానాలను సూచిస్తాయి. ఈ జెండాలపై “ఓం మణి పద్మే హమ్” అనే టిబెటన్ మంత్రం ఉంటుంది. ఆరు అక్షరాలతో ఉన్న ఈ మంత్రం కరుణకు సంబంధించినది. ఓం అంటే పవిత్రమైన శబ్దం, మణి అంటే రత్నం, పద్మే అంటే కమలం, హమ్ అంటే జ్ఞానంతో కూడిన ఆత్మ అని అర్థం. అయితే ఈ మంత్రం శరీరం, వాక్కు, మనస్సును శుద్ధి చేస్తుంది. ఈ జెండాలను గాలి తాకినప్పుడు, ఈ మంత్రాలు, ఆశీర్వాదాలు వాతావరణంలోకి వ్యాపించి శాంతి, మంచి శక్తిని తెస్తాయని టిబెటన్లు నమ్ముతారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Read Also:Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి
-
Car to Last Longer: కారు ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే.. ఈ మిస్టేక్స్ చేయవద్దు
-
Hyundai Venue Sales: రూ.7.94 లక్షలకే క్రెటా లాంటి SUV.. 6.68 లక్షల మంది అభిమానం చూరగొన్న హ్యుందాయ్ వెన్యూ
-
Bikes: బెస్ట్ మైలేజ్ బైక్స్.. ఒకసారి ట్యాంక్ నింపితే 10సార్లు తిరొగొచ్చు!
-
Maruti Suzuki : చీపెస్ట్ ఫ్యామిలీ కారు.. 7 మందితో రయ్ రయ్..!