Bikes: బెస్ట్ మైలేజ్ బైక్స్.. ఒకసారి ట్యాంక్ నింపితే 10సార్లు తిరొగొచ్చు!
Bikes: భారతదేశంలో పేద మధ్యతరగతి జనాభా అధిక సంఖ్యలో ఉంటారు. వీరు తమ రోజువారి పనులు కోసం తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లను కొనుక్కుంటారు.

Bikes: భారతదేశంలో పేద మధ్యతరగతి జనాభా అధిక సంఖ్యలో ఉంటారు. వీరు తమ రోజువారి పనులు కోసం తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లను కొనుక్కుంటారు. కూలి పనులకు, వ్యవసాయ పనులకు, కాలేజీలకు, ఇతర అవసరాలకు టూవీలర్లనే ఎంచుకుంటారు. అందువల్లనే వీరు తక్కువ ధరలో.. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ను ఇష్టపడతారు. వీరి అవసరాలు తీర్చేందుకు ప్రముఖ టు వీలర్ కంపెనీ హీరో ఎప్పుడు ముందుంటుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం ఈ కంపెనీ తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్లను భారతదేశంలో లాంచ్ చేస్తూ ఉంటుంది. మరి మీరు కూడా ఈ కంపెనీ బైక్ కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకుందాం.
Hero Splendor Plus
భారతదేశంలో హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ కు విశేష ఆదరణ ఉంది. ఈ బైక్ తక్కువ ధర ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో ఎక్కువమంది దీనినే ఇష్టపడుతున్నారు. 97.2 సిసి పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉన్న ఈ బైక్ ఏకంగా లీటర్కు 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 77,226 నుంచి మొదలవుతుంది. గరిష్టంగా రూ. 79,836 ఎక్స్ షోరూం ధరతో లభిస్తుంది.
Hero HF 100
హీరో హెచ్ఎఫ్ 100 బైక్ కూడా మంచి మైలేజీ కలిగి ఉంది. 97.2 సిసి పెట్రోల్ ఇంజన్ తో ఈ బైక్ అందుబాటులో ఉంది. ఇది నాలుగు స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.1 లీటర్లుగా ఉంది. ఇక లీటర్ పెట్రోల్ కు 70 కిలోమీటర్ల మైలేజ్ అందించే ఈ బైక్ ధర రూ. 49,999 ఎక్స్ షోరూం ధరగా కంపెనీ నిర్ణయించింది.
Hero super Splendor
హీరో సూపర్ స్పెండర్ xtech ధర మాదిరిగానే మైలేజ్ అందిస్తుంది. ఇదే 124.7 సిసి పెట్రోల్ ఇంజిన్ తో పరుగులు పెడుతుంది. ఈ బైక్ 5 స్పీడ్ గేర్ బాక్స్ లతో వస్తుంది. లీటర్ పెట్రోల్ కు 69 కిలోమీటర్ల మైలేజ్ ను ఈ బైక్ అందిస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. రూ.84,050 నుంచి రూ. 88,050 మధ్య ఉంటుంది.
Hero HF Deluxe
భారత మార్కెట్లో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ క్రేజే వేరు. ఇది 97.2 సిసి పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. నాలుగు స్పీడ్ గేర్ బాక్స్ లతో రై రై అంటుంది. ఇది లీటర్ పెట్రోల్ కు 70 కిలోమీటర్ల మైలేజీ తో వస్తుంది. రూ. 84,551 నుండి రూ. 88,551 ఎక్స్ షోరూం ధర మధ్య ఉంటుంది.
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!
-
Iphone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. వదిలారో మళ్లీరాదు!
-
Lenovo: ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ ల్యాపీ.. 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉంటే చాలు
-
Motorola: మోటారోలా నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు