Tecno pova series: 6000mAh బ్యాటరీతో టెక్నో పోవా 7 సిరీస్ మొబైల్.. ఫీచర్లు చూస్తే పిచ్చేక్కిపోవాల్సిందే!

Tecno pova series:మార్కెట్‌లో ఎన్నో రకాల మొబైల్స్ వస్తు్ంటాయి. అయితే ఎన్ని కొత్త రకాల మొబైల్స్ వచ్చినా కూడా కొందరు వచ్చిన ప్రతీది కొనడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే భారత మార్కెట్‌లోకి టెక్నో పోవా 7 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. పోవా 7, పోవా 7 ప్రో అనే రెండు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. రెండు పరికరాలు డెల్టా లైట్ ఇంటర్‌ఫేస్‌తో వస్తాయి. 104 మినీ LED లైట్‌లు బ్యాక్ ప్యానెల్‌లో ఉంటాయి. ఈ లైట్లు నోటిఫికేషన్‌లు, కాల్‌లు, ఛార్జింగ్, సంగీతం, వాల్యూమ్‌కు డైనమిక్‌గా స్పందిస్తాయి. మీ ఫోన్‌కు గేమర్-శైలి సౌందర్యాన్ని జోడిస్తాయి. రెండు పరికరాలు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
టెక్నో పోవా 7 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.14,999గా ఉంది. అదే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అయితే మార్కెట్‌లో రూ.15,999గా ఉంది. అలాగే టెక్నో పోవా 7 ప్రో 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర అయితే రూ.18,999గా ఉంది. 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. పోవా 7 మ్యాజిక్ సిల్వర్, గీక్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్ మూడు రంగులలో లభిస్తుంది. పోవా 7 ప్రో డైనమిక్ గ్రే, నియాన్ సియాన్ రెండు రంగులలో లభిస్తుంది. అయితే ఇది జూలై 10 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.బ్యాంక్ డిస్కౌంట్ రూ.2000 వరకు ఉంటుంది. అలాగే ఒక ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. రెండు ఫోన్‌లు 6.78-అంగుళాల 144Hz డిస్‌ప్లే ఉన్నాయి. పోవా 7 ఫుల్ HD+ LCD డిస్‌ప్లే ఉంది.
పోవా 7 ప్రో షార్పర్ 1.5K AMOLED ప్యానెల్ ఉంది. ఈ మొబైల్‌కి 7300 అల్టిమేట్ చిప్‌సెట్ ద్వారా 8GB RAM + 8GB వర్చువల్ RAM యాడ్ చేశారు. అయితే గేమింగ్ అన్నింటి కోసం దీన్ని యాడ్ చేశారు. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. అదే పోవా 7 ప్రోలో అయితే 64MP సోనీ తో పాటు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంటుంది. రెండింటిలో కూడా 13MP సెల్ఫీ కెమెరా ఉంది. రెండు మోడళ్లలోనూ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 6000mAh బ్యాటరీ ఉంటుంది. పోవా 7 ప్రో అదనంగా 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత HiOS 15 పై రన్ అవుతుంది. హిందీ, తమిళం, మరాఠీ మరిన్ని భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే ఎల్లా AI చాట్‌బాట్ అమర్చారు. ఇంటెలిజెంట్ సిగ్నల్ ఆప్టిమైజేషన్‌తో వస్తుంది. తక్కువ నెట్‌వర్క్, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. 104 మినీ LED లతో ఫ్యూచరిస్టిక్ LED బ్యాక్ ప్యానెల్, వైర్‌లెస్ ఛార్జింగ్ 6000mAh బ్యాటరీ వల్ల చాలా మంది ఈ మొబైల్స్ అంటే ఇష్టపడుతున్నారు.
ఇది కూడా చూడండి: Junior Movie: వైరల్ వయ్యారి అంటూ.. మాస్ స్టెప్స్‌తో సోషల్ మీడియాను ఉపేస్తున్న హాట్ బ్యూటీ
-
Flipkart Goat Sale: అదిరిపోయే ఫీచర్లతో రూ.4,499 స్మార్ట్‌ఫోన్.. ఆలస్యమెందుకు కొనేయండి
-
Mahindra : నెక్సాన్, బ్రెజ్జాకు గట్టిపోటీ.. మహీంద్రా చౌకైన కారు అప్ డేటెడ్ వెర్షన్ వస్తోంది
-
Oppo reno series: తక్కువ ధరకే బెస్ట్ ఫోన్ భయ్యా.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!
-
Iphone 17 series: సెప్టెంబర్‌లో లాంఛింగ్‌కి రెడీగా ఉన్న ఐఫోన్ 17 సిరీస్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!
-
Huawei smart band 10: హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్.. బెస్ట్ ధరకు ఫీచర్లు
-
Galaxy Buds 3 Series: గెలాక్సీ ఇయర్ బడ్స్ 3 సిరీస్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు