Junior Movie: వైరల్ వయ్యారి అంటూ.. మాస్ స్టెప్స్‌తో సోషల్ మీడియాను ఉపేస్తున్న హాట్ బ్యూటీ

Junior Movie: పెళ్లి సందడితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఊపేస్తున్న శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా కూడా శ్రీలీలకు డిమాండ్ వేరే లెవెల్. చిన్న, పెద్ద హీరోలు అని లేకుండా అందరితో కూడా శ్రీలీల నటించింది. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అన్నింట్లో కూడా నటిస్తోంది. అయితే శ్రీలీల తాజాగా గాలి జనార్థన రెడ్డి కొడుకు కిరీటీతో నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో జూనియర్ అనే సినిమా ఈ జులై 18వ తేదీన రాబోతుంది. వారాహి చలన చిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించగా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. గాలి జనార్థన రెడ్డి వారసుడు కిరీటీ ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఒక మాస్ పాటను మూవీ టీం రిలీజ్ చేసింది. వైరల్ వయ్యారి అంటూ సాగే ఈ సాంగ్‌కు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. పాట వింటే వింటేజ్ దేవీ గుర్తు వస్తున్నాడు. అలాగే పాట కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది.
ఇది కూడా చూడండి: Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఎక్కి ఎక్కి ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు
ఇందులో కిరీటీ, శ్రీలీల అయితే డ్యాన్స్, మాస్ బీట్స్‌తో అదరగొట్టారు. వైరల్ వయ్యారి అంటూ ఉన్న ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మాస్ స్టెప్స్‌తో హీరో, హీరోయిన్ అయితే అదరగొట్టారు. ముఖ్యంగా కిరీటీ అయితే తన డ్యాన్స్ స్టెప్స్‌తో ఎన్టీఆర్‌ను తలపించాడు. ప్రతీ స్టెప్ చాలా పెర్ఫక్షన్తో వేశాడు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ వైరల్ వయ్యారి అంటూ సోషల్ మీడియాను ఉపేస్తుంది. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా కూడా ఇదే పాట కనిపిస్తోంది. లిరిక్స్, డ్యాన్స్, పాట, మ్యూజిక్ ఇలా అన్ని కూడా ఫర్ఫెక్ట్గా ఈ పాటకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మాస్ బీట్స్‌తో ఉన్న పాట నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి కిరీటిరెడ్డి, శ్రీలీల కాంబోలో వస్తున్న ఈ మూవీ లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనింగ్. ఈ జూనియర్ మూవీలో జెనీలీయా చాలా కాలం తర్వాత టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా జులై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఉరమాస్గా ఉన్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను హల్ చల్ చేస్తోంది. నెట్టింట ఈ పాట తెగ వైరల్ అవుతోంది.