Devi Sri Prasad: కుబేర సక్సెస్ మీట్ స్పీచ్.. పేమెంట్‌కు దేవిశ్రీ కౌంటర్ వేశాడా?

Devi Sri Prasad: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా ఏదైనా మూవీ కొత్తది వస్తోందంటే అందులో తప్పకుండా ఉంటాడు. దేవి మ్యూజిక్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా సన్నివేశాలకు తగ్గట్లుగా బీజీఎం ఉంటుంది. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ను ఒక్కసారిగా పెంచేస్తారు. అయితే ఈ ఏడాదిలో నాగచైతన్య తండేల్ మూవీకి ఇచ్చిన బీజీఎంతో విజయం అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు కుబేర మూవీతో మరో హిట్ కొట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. మంచి హిట్ టాక్ సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కూడా ప్రశంసలు అందాయి. అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లో కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవీ శ్రీ ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తు్తం సంచలన రేపుతున్నాయి.
ఈ సక్సెస్ మీట్‌లో దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాతలు, సినిమా రెమ్యునరేషన్ గురించి అన్నారు. మూవీ రిలీజ్‌కు ముందే నిర్మాతలు పేమెంట్స్ ఇచ్చేశారని, ఇంతకంటే హ్యాపీ ఏం ఉంటుందన్నారు. ముందు పేమెంట్స్ ఇవ్వడంతో సునీల్ నారంగ్‌కు దేవీశ్రీ ప్రసాద్ ధ్యాంక్స్ చెప్పారు. అయిత ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవీ కెరీర్‌లో వర్క్ చేసిన గొప్ప ప్రొడక్షన్స్‌లో ఆసియన్ సినిమాస్ ఒకటి. వీరు మూవీ రిలీజ్‌కు ముందే డబ్బులు ఇచ్చారు. కొత్త స్టోరీకి సంగీతాన్ని అందించాని, బాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చానని అందరూ అభినందిస్తున్నారని దేవీ అన్నారు. మూవీకి బాగా వర్క్ చేయడం వల్ల పేమెంట్స్ ముందుగా ఇచ్చారని దేవీశ్రీ ప్రసాద్ అన్నారు. అయితే ఇది స్పీచ్ కాదని, కొందరికి కౌంటర్ అని తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని రోజుల కిందట దేవిశ్రీ ప్రసాద్‌కు రెమ్యునరేషన్ విషయంలో ఓ ప్రొడక్షన్ హౌస్ భారీ పెండింగ్ పెట్టిందట. అయితే ఇది బాగా వైరల్ అయ్యింది. దేవీ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల పెండింగ్ పెట్టినట్లు రూమర్స్ వచ్చాయి. ఈ కారణంగానే కుబేర సక్సెస్ మీట్‌లో దేవీ శ్రీ ప్రసాద్ వాళ్లకి కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్
-
RGV Sensational Comments: సందీప్ వంగా, దీపికా పదుకొణె ఇష్యూపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
Prakash Raj: కోట శ్రీనివాస రావు అందరికీ నచ్చలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Junior Movie: వైరల్ వయ్యారి అంటూ.. మాస్ స్టెప్స్‌తో సోషల్ మీడియాను ఉపేస్తున్న హాట్ బ్యూటీ
-
Kubera: 100 కోట్ల క్లబ్‌లోకి కుబేర.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
-
Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్