Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్

Google Maps : ఈరోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా, దారి తెలియకపోయినా, లేదంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉందా లేదా అనేది తెలుసుకుకోవాలన్నా.. ముందుగా మనకు గుర్తుకొచ్చేది గూగుల్ మ్యాప్స్. ఇది కేవలం దారి చూపించే యాప్ మాత్రమే కాదు, ఇందులో చాలా సూపర్ ఫీచర్లు ఉన్నాయి. అవి మన జీవితాన్ని ఇంకా సులభం చేస్తాయి. మరి అలాంటి కొన్ని ముఖ్యమైన గూగుల్ మ్యాప్స్ ఫీచర్ల గురించి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
గూగుల్ మ్యాప్స్ లోని ముఖ్యమైన ఫీచర్లు
ట్రాఫిక్ సమాచారం: మీరు బయలుదేరే ముందు దారిలో ట్రాఫిక్ ఎలా ఉందో గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. దారి క్లియర్‌గా ఉంటే ఆకుపచ్చ రంగు, కొంచెం రద్దీగా ఉంటే నారింజ రంగు, బాగా ట్రాఫిక్ ఉంటే ఎరుపు రంగు కనిపిస్తుంది. దీన్ని చూసి మీరు ఏ దారిలో వెళ్లాలో ముందే ప్లాన్ చేసుకోవచ్చు.
వాయిస్ గైడెన్స్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ చూసుకుంటూ వెళ్లడం ప్రమాదం. అందుకే గూగుల్ మ్యాప్స్ లో వాయిస్ గైడెన్స్ ఉంటుంది. మీరు వెళ్లాల్సిన దారిని సెలెక్ట్ చేసుకుని, స్టార్ట్ అని నొక్కగానే అది మీకు దారి చెబుతూ ఉంటుంది. టేక్ లెఫ్ట్, టేక్ రైట్ అని వాయిస్ లో చెబుతుంది. ఇది డ్రైవింగ్ ను చాలా సేఫ్ చేస్తుంది.
Read Also:Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు
ఇల్లు, ఆఫీస్ అడ్రస్‌లు సేవ్ చేసుకోవాలి: ప్రతిసారి మీ ఇంటి లేదా ఆఫీస్ అడ్రస్‌ను టైప్ చేయాల్సిన అవసరం లేదు. సెర్చ్ బార్ లో ‘ఇల్లు’ లేదా ‘ఆఫీస్’ అని వెతికి, మీ అడ్రస్ ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటే చాలు. తర్వాత ఎప్పుడైనా మీరు ‘ఇల్లు’ లేదా ‘ఆఫీస్’ అని టైప్ చేయగానే ఆ లొకేషన్ వచ్చేస్తుంది.
తప్పకుండా ట్రై చేయాల్సిన ఇతర ఫీచర్లు:
దగ్గర్లో ఉన్న ప్రదేశాలు: మీకు దగ్గర్లో ఏటీఎంలు ఎక్కడ ఉన్నాయి. పెట్రోల్ పంపులు ఎక్కడ ఉన్నాయి. హోటళ్లు, హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అర్ధరాత్రి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది.
Read Also:Amazon : సరికొత్త సర్వీసును ప్రారంభించిన అమెజాన్.. ఇంటి వద్దకే డయాగ్నోస్టిక్స్ సేవలు
ఇంటర్నెట్ లేకపోయినా మ్యాప్స్: మీ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు. ఇందుకోసం మీరు వెళ్లాలనుకున్న ప్లేస్ మ్యాప్‌ను ముందుగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతాన్ని వెతికి పైన మూడు చుక్కలపై నొక్కి, ‘ఆఫ్‌లైన్ మ్యాప్ డౌన్లోడ్’ చేసుకోవచ్చు. దీంతో నెట్వర్క్ లేకపోయినా మీరు దారి చూసుకోవచ్చు.
ఎవరైనా మిమ్మల్ని ట్రాక్ చేయాలంటే: మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారో మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి తెలియాలంటే మీ లొకేషన్‌ను వాళ్లతో పంచుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్లు లైవ్ లో చూసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడే ఫీచర్.