Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు

Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ‘రెట్రో’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే ఒకసారి హైదరాబాద్‌లోని ఆర్.ఎస్.నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇప్పుడు అదే పాత వ్యాఖ్యల కారణంగా ఆయనపై మరోసారి కేసు నమోదైంది. ఆదివాసీల మనోభావాలను విజయ్ కించపరిచారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఆదివాసీ సమాజ నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. విజయ్‌పై ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం.
Read Also:Amazon : సరికొత్త సర్వీసును ప్రారంభించిన అమెజాన్.. ఇంటి వద్దకే డయాగ్నోస్టిక్స్ సేవలు
కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో హీరో సూర్య నటించిన సినిమా రెట్రో. మే 1న ఈ సినిమా రిలీజ్ అయింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఏప్రిల్ 26న జరిగింది. ఈ ఈవెంట్‌కు విజయ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ జరగడానికి నాలుగు రోజుల ముందు జమ్మూకాశ్మీర్‌లోని పర్యాటక ప్రదేశం పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలంటూ దేశం మొత్తం ఊగిపోయింది. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. దీంతో పాకిస్తాన్ సైతం మనదేశంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిని సైన్యం దీటుగా ఎదుర్కొంది.
ఉగ్రవాదుల దాడి సందర్భంగా రెట్రో స్టేజ్ పై ఆగ్రహంతో ఊగిపోయారు విజయ్. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉగ్రవాద నా***లకు సరైన చదువు చెప్పించి ఉంటే బ్రెయిన్‌వాష్ అవ్వకుండా ఉంటారని విజయ్ మండిపడ్డారు. కాశ్మీర్ ఇండియాదే.. కాశ్మీరీలు మనవాళ్లే, తాను షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లానని చాలా బాగా చూసుకున్నారని విజయ్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదని.. అక్కడి ప్రజలే ఆ దేశ ప్రభుత్వంపై దాడి చేస్తారని విజయ్ దేవరకొండ జోస్యం చెప్పారు. ఇండియన్స్ అంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పాతకాలంలో అడవిలో ఉండే గిరిజన తెగలు (Tribal communities) ఎలా కొట్టుకునేవాళ్ళో, ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్‌లు కూడా అలాగే కొట్టుకుంటున్నాయి అని అన్నాడు. సరిగ్గా ఈ మాటలే ఇప్పుడు పెద్ద సమస్య అయ్యాయి.
Read Also:Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది
విజయ్ మాటలు తమ జాతిని, తమ గిరిజనులను అవమానించేలా ఉన్నాయని ఆదివాసీలు చాలా కోపంగా ఉన్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో గిరిజన సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి, విజయ్ దేవరకొండ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ గొడవపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
-
Kingdom First Review: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
-
Kingdom Pre Release Event: కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
-
Vijay Deverakonda Stunt: కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతలా కష్టపడ్తున్నాడో చూడండి
-
Vijay Deverakonda : పెరిగిపోతున్న విమర్శలు.. పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ
-
Hari hara veera mallu movie: హరి హర వీర మల్లుకు బిగ్ షాక్.. విడుదల కష్టమే!
-
Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?