Hari hara veera mallu movie: హరి హర వీర మల్లుకు బిగ్ షాక్.. విడుదల కష్టమే!

Hari hara veera mallu movie:ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమాకి బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా వివాదంలోకి చిక్కుకుంది. సినిమా రిలీజ్ చేయడం కుదరని, బీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను దర్శకుడు వక్రీకరించారని ఆరోపిస్తూ ముదిరాజ్ సామాజిక వర్గం ఈ సినిమాపై తీవ్రంగా ఆరోపణలు చేసింది. అయితే సాయన్న కథ మీద ఈ సినిమా తీసినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో ముదిరాజ్ సంఘాలు అడ్డుకుంటున్నాయి. సాయన్న చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నాయి. లేని కధలను కూడా కల్పిస్తున్నారని, ఇలా సంబంధం లేనివి కల్పించడం ఎందుకని ఆరోపణలు చేస్తున్నారు. అయితే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. ఇప్పటికే సినిమాను పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన సినిమా రిలీజ్ కావడం కష్టమే అని టాక్ వినిపిస్తోంది. అయితే పండుగ సాయన్న పాలమూరుకి చెందిన వారు. అక్కడ 19వ శతాబ్ధంలో దొరలు, దేశ్‌ముఖ్‌ల సంపదను కొల్లగొట్టి పేదలకు పంచారు. ఇతనిపై ఓ నవల కూడా రాశారు. అయితే సినిమాలో ఇది ఒక కల్పిత పాత్రగా తీసుకొస్తున్నారు. కానీ సాయన్నకు కాస్త పోలికలు ఉన్నాయని, ఇది బీసీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శివ ముదిరాజ్ అడ్డుకున్నారు. సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకోమని, అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల ఇలా వాయిదా పడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా కొన్నేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇందులో కొంత భాగాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించారు. కొన్ని కారణాల వల్ల అతను తప్పుకోవడంతో ఇక జ్యోతి కృష్ణ మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రాబోతుంది. ఇప్పుడు మొదటి పార్ట్ రిలీజ్ కాబోతుంది. రెండో పార్ట్ ఆ తర్వాత రానుంది. మొదటి పార్ట్ అనేది హరి హర వీర మల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో జూలై 24వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మాలయాళ భాషల్లో రానుంది. ఈ సినిమా నిజానికి జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా వీఎఫ్‌ఎక్స్ పూర్తిగా కావడంతో సినిమాను జూలై 24 వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా 2020లో షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, కరోనా మహమ్మారి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల వల్ల అనేక సార్లు షూటింగ్ ఆగిపోయింది. దీనివల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా సినిమా విడుదల కష్టమే అంటున్నారు.
Read Also:Infosys : 46గంటలు దాటి పని చేస్తే ఇన్ఫోసిస్ వార్నింగ్.. నారాయణ మూర్తి మాటలకు భిన్నంగా కంపెనీ పాలసీ
-
Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?
-
Pavan Kalyan: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో చూశారా?
-
Pavan kalyan: పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు.. పోలీసులు ఎందుకు నమోదు చేశారంటే?
-
Hari hara veera mallu: ఇది సార్ పవన్ కళ్యాణ్ అంటే.. 5 నిమిషాల్లో ఫుల్..’హరి హర వీరమల్లు’ ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్స్
-
Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు
-
Ambati vs Police : నువ్వెంత అంటే నువ్వెంత.. అంబటిని ఇచ్చి పడేసిన సీఐ!