Hari hara veera mallu: ఇది సార్ పవన్ కళ్యాణ్ అంటే.. 5 నిమిషాల్లో ఫుల్..’హరి హర వీరమల్లు’ ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్స్

Hari hara veera mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్నా ఈ సినిమా ట్రైలర్ జూన్ 3వ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. సినిమాను తెలుగు తో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో కలిపి 120 థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబందించిన ట్రైలర్ అయిన సినిమా అయినా థియేటర్లు బద్దలు అవ్వాల్సిందే. అయితే అభిమానుల కోసం మూవీ టీం ఒక నిర్ణయం తీసుకుంది. ఎన్నో రోజుల తరువాత పవన్ మూవీ రావడంతో కొన్ని థియేటర్స్ లో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ లో థియేటర్ లో ఎక్కువగా అభిమానులు ఉంటారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం.
ఈ క్రమంలోనే మూవీ టీం ఒక నిర్ణయం తీసుకుంది. బెంగళూరలో ఉన్న సంధ్య థియేటర్ లో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ నైట్ స్టార్ట్ చేశారు. బుకింగ్స్ ఇలా ఓపెన్ చేయగానే అలా అయిపోయాయి. టికెట్స్ ఓపెన్ చేసిన 5 నిమిషాల్లో టికెట్స్ క్లోజ్ అయ్యాయి. అయితే ఒక్కో టికెట్ ను కేవలం రూ. 11 కి విక్రయించారు. కానీ అన్నీటితో కలిపి 36 రూపాయిలు అవుతుంది. అలాగే థియేటర్ల లో ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తే వాటిని కవర్ చేయడానికి ఈ ఎక్సట్రా ఛార్జ్ పెట్టారట. అయితే హరిహర వీరమల్లు కి ఈ ఒక్క షో ద్వారా దాదాపుగా రూ. 28 వేలు వచ్చాయట. పవన్ సినిమాకి ఈ డిమాండ్ ఉండటంతోనే ఇంత వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది.
ఇలా బెంగళూరులో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టినట్లు మిగతా థియేటర్లో కూడా మొదలుపెట్టి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బెంగళూరు సిటీ లో ఇది బాగా బుకింగ్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రైలర్ ఈవెంట్స్ కు బుకింగ్స్ బానే వస్తాయి అని తెలుస్తుంది. బెంగళూరు తో పాటు హైదరాబాదులో కూడా నిజాం, ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్లో ఆ ట్రైలర్ రిలీజ్ కి బుకింగ్స్ మొదలు కానట్లు సమాచారం. అయితే హైదరాబాద్ మొత్తం మీద చూసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఈ ట్రైలర్ రిలీజ్ చేయాలని మూవీ భావిస్తుంది. మరి ఇంతలో మూవీ టీం ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also read: Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Hari hara veera mallu movie: హరి హర వీర మల్లుకు బిగ్ షాక్.. విడుదల కష్టమే!
-
Pavan Kalyan: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో చూశారా?
-
Pavan kalyan: పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు.. పోలీసులు ఎందుకు నమోదు చేశారంటే?
-
Honda : హోండా ధమాకా ఆఫర్..కేవలం రూ.678కే 102కిమీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్
-
RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. విక్టరీ పరేడ్‌కి నో పర్మిషన్