Pavan kalyan: పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు.. పోలీసులు ఎందుకు నమోదు చేశారంటే?

Pavan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలో స్టార్ గా ఎదిగి ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై తమిళనాడు లోని పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్స్ 196(1)(a),299 ,302, 353 (1)(a)(b) క్రింద అన్నా నగర్ పోలీసులు క్రిమినల్ కేసు పవన్ కళ్యాణపై నమోదు చేశారు. అసలు తమిళనాడు పోలీసులు ఎందుకు పవన్ పై కేసు నమోదు చేసారనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇటీవల చెన్నైలో మురుగన్ మనాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. అందరు కూడా పవన్ స్పీచ్ పై కామెంట్స్ చేశారు. ఇప్పటికి కూడా ఆ కామెంట్స్ పై నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందరో హీరోలు ప్రసంగాలు ఇచ్చిన కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్క స్పీచ్ తో ఇంత రెస్పాన్స్ రావడంతో తమిళనాడులో ఈ వాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తమిళనాడులో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, అన్నామలై కలిసి నిబంధనలు ఉల్లఘించారు. మతం, ప్రాంతాన్ని బట్టి రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడారని తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వేరేలా ఉండేవాడని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారని అన్నారు. ఎప్పుడు లేని విధంగా సనాతన ధర్మంపై ఎక్కువగా ఉపన్యాసాలు చేస్తున్నారని అన్నారు. బిజెపి పార్టీని తన భుజాలపై వేసుకొని మరి వెళ్తున్నారని అంటున్నారు. ఈ సనాతన ధర్మం తనకి భవిష్యత్తులో ఎన్నో సమస్యలను తెచ్చి పడుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మతం పేరు ఎత్తకుండా పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉండడం లేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలలో సనాతన ధర్మం గురించి ప్రస్తావించకపోవడం మంచిదని పలువురు భావిస్తున్నారు. క్రిమినల్ కేసు నమోదు కావడం వల్ల ఇక సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ వాఖ్యలు చేయరు ఏమో చూడాలి.
మిగతా పార్టీ వాళ్లు కాకుండా జనసేన పార్టీ వాళ్లు కూడా వీటిపై స్పందిస్తున్నారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఇలానే సనాత ధర్మం గురించి ప్రస్తావించారని పలువురు అంటున్నారు. మరికొందరు పవన్ కళ్యాణ్ కి అలా ఉండదని అంటున్నారు. చాలాసార్లు క్రిస్టియన్ ముస్లిం వారికి అతను డొనేట్ కూడా చేశారని ప్రశంసిస్తున్నారు. మంచి మనసు అని, అన్ని మతాలను ఒకేలా చూస్తారని, గౌరవిస్తారని పలువురు ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ కేసు ఎంత వరకు వెళ్తుందా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందో చూడాలి.