Pavan Kalyan: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో చూశారా?

Pavan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఒక పక్క రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహించడంతో పాటు సినిమాలతో కూడా బిజీగా ఉంటున్నారు. అయితే ఇటీవల హరిహర వీరమల్లు , ఓజీ చిత్రాల షూటింగ్ పవన్ పూర్తి చేశారు. తాజాగా హరి హర వీర మల్లు ట్రైలర్‌ను కూడా మూవీ టీం విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అయితే షూటింగ్స్‌లో పవన్ బిజీగా ఉంటూనే కుటుంబానికి సమయం ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కొడుకులతో ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కొడుకులతో కలసి ఒక ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎయిర్‌పోర్టులో తన ఇద్దరు కుమారులతో కనిపించారు. మధ్యలో పవన్ కళ్యాణ్ అటు ఇటు ఇద్దరూ కొడుకులు ఉన్నారు. అకీరా నందన్ అయితే క్లీన్ లుక్‌లో సూపర్‌గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌ని జాగ్రత్తగా చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో అయితే నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఇద్దరు కుమారులతో పవన్ కళ్యాణ్.. భలేగా ఉన్నారని అంటున్నారు. ఫొటో ఆఫ్ ది డే అని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
Mark , Akira & @PawanKalyan 🤩#Pawankalyan #HariHaraVerraMallu pic.twitter.com/UIz9ptDa2T
— Pavan Naidu Pspk (@PavanGone2) July 4, 2025
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కొన్ని నెలల కిందట సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. తన భార్య అన్నా లెజినోవా చదువు నిమిత్తం అక్కడ స్కూ్ల్‌లో చేర్చారు. స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మార్క్ శంకర్‌ను ఇండియాకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మార్క్ శంకర్ హైదరాబాద్ పటాన్‌చెరు సమీపంలోని ఇక్రిశాట్ క్యాంపస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో చేర్చారు. అయితే ఈ స్కూల్‌ను 1981లో స్థాపించారు. మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్కూల్ చాలా బాగుంటుంది. ఇందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. పిల్లలు ఆడుకునేందుకు టెన్నిస్ కోర్ట్, ఫుట్‌బాల్ గ్రౌండ్, క్రికెట్ ప్లే గ్రౌండ్, మ్యూజియం, వాతావరణ పరిశోధన స్టేషన్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. అయితే ఈ స్కూల్‌లో మార్క్ శంకర్‌ను చదివించడానికి పవన్ భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Pavan kalyan: పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు.. పోలీసులు ఎందుకు నమోదు చేశారంటే?
-
Hari hara veera mallu: ఇది సార్ పవన్ కళ్యాణ్ అంటే.. 5 నిమిషాల్లో ఫుల్..’హరి హర వీరమల్లు’ ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్స్
-
Viral Photo : ఈ బుడ్డోడు ఎవరో చెప్పగలరా.. మొదటి సినిమాతోనే రూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన హీరోగా బాగా ఫేమస్..
-
Viral Photo : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఈమె అందానికి కుర్రాళ్ళ మతి పోవాల్సిందే…లేటెస్ట్ ఫోటోలు వైరల్..
-
Tollywood Heroine: కేవలం 15 ఏళ్ల వయసులో హీరోయిన్ గా భారీ హిట్.. 40 ఏళ్ల వయసులో కూడా హిట్స్ అందుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా…
-
Viral Photo : మోటార్ సైకిల్ పై ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా..