Tollywood Heroine: కేవలం 15 ఏళ్ల వయసులో హీరోయిన్ గా భారీ హిట్.. 40 ఏళ్ల వయసులో కూడా హిట్స్ అందుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా…
సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఒకప్పుడు మరియు ఇప్పుడు ఉన్న ట్రెండ్ మీరు గమనించే ఉంటారు. చాలామంది నటీనటులు నమ్మలేని విధంగా మారిపోయి తమ లుక్స్ లో ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటున్నారు.

Tollywood Heroine :సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఒకప్పుడు మరియు ఇప్పుడు ఉన్న ట్రెండ్ మీరు గమనించే ఉంటారు. చాలామంది నటీనటులు నమ్మలేని విధంగా మారిపోయి తమ లుక్స్ లో ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటున్నారు.
ఇటువంటి ఫోటోలకు ఓ రేంజ్ లో లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీల చిన్ననాటి పాత ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల పుట్టినరోజు లేదా ఏదైనా వేడుక ఉండే చాలు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్లు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పించినవారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత హీరో, హీరోయిన్లుగా సినిమాలను చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలామంది సీనియర్ హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఈమె హీరోయిన్గా కూడా చాలా సినిమాలలో నటించి తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ఈమె తెలుగులో అందరూ స్టార్ హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. 15 ఏళ్ల చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె నలభై ఏళ్ల వయసులో కూడా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనా.
ఒకప్పుడు టాలీవుడ్లో ఈమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన మీనా తెలుగుతోపాటు తమిళ్, మలయాళం లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ లో దాదాపు అందరూ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను సొంతం చేసుకుంది. 15 ఏళ్ల చిన్న వయసులోనే మీనాకు సీతారామయ్య గారి మనవరాలు అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మీనా కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.
1991 నుంచి సుమారు ఒక దశాబ్దం పాటు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా రాణించింది మీనా. ఆ తర్వాత ఈమె 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు నైనిక అనే ఒక కూతురు ఉంది. నైనిక కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక ఆ తర్వాత 2022లో మీనా భర్త అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగులో మీనా వెంకటేష్ కు జోడీగా దృశ్యం సినిమాలో నటించింది. అలాగే దృశ్యం 2 లో కూడా మీనా నటించింది. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి.

Tollywood Heroine meena
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!
-
Viral Photo : ఈ బుడ్డోడు ఎవరో చెప్పగలరా.. మొదటి సినిమాతోనే రూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన హీరోగా బాగా ఫేమస్..
-
Viral Photo : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఈమె అందానికి కుర్రాళ్ళ మతి పోవాల్సిందే…లేటెస్ట్ ఫోటోలు వైరల్..
-
Tollywood Heroine : రెండు జడలు వేసుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా..