RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. విక్టరీ పరేడ్కి నో పర్మిషన్

RCB: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్స్ బెంగళూరు జట్టు అవతరించింది. 18 ఏళ్ల కళను నెరవేర్చుకుంది. ఆర్సీబీ జట్టు గెలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఆర్సీబీ జట్టుకు విరాట్ కోహ్లీ ఎంత నిజాయితీగా ఉన్నాడో.. ఫ్యాన్స్ కూడా ఆ జట్టుకు అంతే నిజాయితీతో ఉన్నారు. అయితే 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీల్ మొదటి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ ఆనందాన్ని ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్సీబీ జట్టు భావించింది. ఈ క్రమంలో సాయంత్రం విక్టరీ పరేడ్‌ను నిర్వహించాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయించింది. చిన్నస్వామి స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్‌ను నిర్వహించాలని భావించింది. కానీ బెంగళూరు పోలీసులు దీనికి అనుమతి ఇవ్వలేనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:IPL 2025 Final: రిజర్డ్వ్ డే రోజు వర్షం పడితే.. విన్నర్ ఇక ఆ జట్టే!
ఎందుకంటే నేడు వర్కింగ్ డే కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని భావించింది. అలాగే విక్టరీ పరేడ్‌కు భారీగా బందోబస్తు ఉండాలి. ఇప్పుడు అదంతా కష్టమని పోలీసులు పర్మిషన్ ఇవ్వలేనట్లు తెలుస్తోంది. అయితే చిన్న స్వామి స్టేడియం విజయ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయతే ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి కేవలం పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. అలాగే పార్కింగ్ సమస్య రాకుండా అభిమానులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.
ఇది కూడా చూడండి:IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ పంజాబ్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించింది. 18 ఏళ్ల తర్వాత తొలి టైటిల్‌ను ఆర్సీబీ ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. కేవలం బెంగళూరులోనే కాకుండా హైదరాబాద్, పుణె, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో అభిమానులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే 18 ఏళ్లుగా ఆర్సీబీని అంటి పెట్టుకున్న అభిమానులతో కలిసి బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ నిర్వహించాలని భావించింది. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయే సరికి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
-
Arrest Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ట్రెండింగ్‌లో #ArrestKohli
-
Bengaluru Stampede Tragedy: మీరు మారరా.. తొక్కిసలాటపై మండిపడుతున్న నెటిజన్లు
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Virat Kohli Sensational Comments Rohit: రోహిత్‌పై కోహ్లీ సంచలన కామెంట్స్.. ఇంపాక్ట్ చూపించడం లేదంటూ..?
-
IPL 2025 final, RCB vs PBKS: నేడే తుది సమరం.. ఏ జట్టు గెలిచినా చరిత్రే
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్‌కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు