Arrest Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ట్రెండింగ్‌లో #ArrestKohli

Arrest Kohli: ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు విజేతగా నిలవడంతో బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవం నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వెళ్లడంతో ఒక్కసారి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కసలాటలో 11 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. 35 వేలు మంది పట్టే స్టేడియంలో 3 లక్షలకు పైగా ఫ్యాన్స్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అయితే సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. అయితే ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా సీఐడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అసలు ఈ తొక్కిసలాట ఎలా జరిగింది? ప్రభుత్వం వీటిని కంట్రోల్ చేయలేకపోయిందనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కోహ్లీని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. #ArrestKohli అనే హ్యాష్ టాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. మరికొందరు కోహ్లీ తప్పు ఏం లేదని, ట్రెండ్ చేస్తున్నారు.
They chanted his name when he scored centuries. Now they blame him for crowd mismanagement?
Be real. Virat Kohli left AFTER the event was done. Stop this hate drama.
SHAME ON RCB? Really? 🙄 #ArrestKohli — for what? Breathing? pic.twitter.com/lf2Ue8qAXl
— Manni (@ThadhaniManish_) June 5, 2025
ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అటువంటి పెద్ద ఈవెంట్‌లను నిర్వహించడం ఎంతమాత్రం సరికాదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద సంఘటనపై కర్ణాటక ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరు పోలీస్ కమిషనర్‌తో పాటు ఈ తొక్కిసలాటకు బాధ్యులైన ఇతర పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటనకు సంబంధించి ఆర్‌సీబీ ప్రతినిధులు, డీఎన్‌ఏ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు, అలాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీలను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ఘటనతో క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. అభిమానుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన భవిష్యత్తులో ఇలాంటి భారీ క్రీడా లేదా ఇతర ఈవెంట్‌ల నిర్వహణలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని అంటున్నారు.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
-
RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. రిపోర్టు లో సంచలన విషయాలు
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Tamannaah Bhatia-Vijay Varma: తమన్నాకి బ్రేకప్.. ఆ హీరోయిన్‌తో విజయ్ వర్మ రొమాన్స్.. ప్రైవేట్ వీడియో లీక్
-
Avika Gor Getting Married: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. కాబోయే భర్త ఫొటోలు చూశారా?