ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే

ENG vs IND: టీమిండియా త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ భారత్‌తో జరిగే తొలి టెస్ట్ కోసం 14 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్, భారత్‌తో మొత్తం ఐదు టెస్టులు ఆడనుంది. హెడింగ్లీలో భారత్‌తో జరిగే మొదటి టెస్టు కోసం జట్టును ప్రకటించింది. పేసర్ గస్ అట్కిన్సన్ గాయం కారణంగా ఇంగ్లాండ్ ప్రకటించిన జట్టులో అతని పేరు లేదు. ఇటీవల ట్రెంట్ బ్రిడ్జ్‌లో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ సందర్భంగా అట్కిన్సన్ కుడి స్నాయువు గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇతన్ని జట్టులోకి తీసుకోలేదు. గతేడాది న్యూజిలాండ్ టెస్ట్ పర్యటనలో చివరి సారిగా ఆడిన సీమర్ బ్రైడాన్ కార్స్, జాకబ్ బెథెల్, క్రిస్ వోక్స్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్ ఇది వరకే ఇంగ్లాండ్ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభమన్ గిల్‌ను బీసీసీఐ కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ సిరీస్‌లో టీమిండియా గిల్ నాయకత్వంలో ఆడనుంది.
భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్,బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (సి), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీ (లీడ్స్)లో జూన్ 20 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు జరగనుంది. రెండవ టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్‌లో జూలై 2వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు జరగనుంది. మూడవ టెస్ట్ లార్డ్స్ (లండన్) లో జూలై 10 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనుంది. నాలుగవ టెస్ట్ ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్) లో జూలై 23 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు జరగనుంది. ఐదవ టెస్ట్ ది ఓవల్ (లండన్) లో జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 4 వ తేదీ వరకు జరగనుంది.
ఇది కూడా చూడండి: Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Ind Vs Eng 4th Test: టీమ్ లోకి అన్షుల్ కాంబోజ్.. భారత జట్టు ఇదే
-
England Vs India 4th Test: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్.. భారత్ కు కఠిన పరీక్ష