Ind Vs Eng 4th Test: టీమ్ లోకి అన్షుల్ కాంబోజ్.. భారత జట్టు ఇదే
Ind Vs Eng 4th Test ఇండియా తరఫున టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 318వ క్రికెటర్ గా కాంబోజ్ నిలిచాడు.

Ind Vs Eng 4th Test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. భారత జట్టులో ఈ మ్యాచ్ కోసం మూడు మార్సులు చేశారు. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ ను తీసుకున్నారు. నితీశ్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ కు చోటు కల్పించారు. అయితే టెస్టుల్లో కాంబోజ్ అరంగేట్రం చేయనున్నాడు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో కేరళతో జరిగిన మ్యాచ్ లో అతను ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు.
ఇండియా తరఫున టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 318వ క్రికెటర్ గా కాంబోజ్ నిలిచాడు. అతను 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. వాటిల్లో 79 వికెట్లు తీసుకున్నాడు. ఇండియా ఏ తరఫున అతను చివరి మ్యాచ్ ఆడాడు. నార్తంప్టన్ లో ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో ఆ మ్యాచ్ జరిగింది. దాంట్లో అతను రెండు ఇన్నింగ్స్ ల్లో రెండేసి వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్ లో 51 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్ డ్రా అయ్యింది.
-
Sourav Ganguly: టెస్టుల్లో కుల్దీప్ ను తప్పించడంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్
-
England Vs India 4th Test: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్.. భారత్ కు కఠిన పరీక్ష
-
IND vs ENG Lords Test: జడేజా ఒంటరి పోరాటం వృథా.. లార్డ్స్‌లో భారత్ ఓటమికి కారణాలివే
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Yashasvi Jaiswal : రెండు సిక్స్ లు కొడితే చాలు.. ఆ రికార్డు బద్ధలు కొట్టనున్న యశస్వి జైస్వాల్
-
IND vs ENG: మొదటి టెస్ట్‌లో భారత్ ఓటమి.. కారణాలివే!