IND vs ENG Lords Test: జడేజా ఒంటరి పోరాటం వృథా.. లార్డ్స్‌లో భారత్ ఓటమికి కారణాలివే

IND vs ENG Lords Test: లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమి పాలైంది. 22 పరుగుల తేడాతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయింది. టీమిండియా భారత్ చివరి వరకు పోరాడారు. మ్యాచ్‌ను గెలిపించడానికి రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేశాడు. కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ కలిసి స్కోర్‌ను కాస్త పెంచారు. కానీ టీమిండియా ఒకే బ్యాటర్‌తో ఆడింది. మ్యాచ్ గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరకు ఓటమిపాలైంది. ఈ లార్డ్స్ స్టేడియంలో ఇప్పటి వరకు టీమిండియా కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచి రికార్డు అయ్యేది. 1986లో టీమిండియా ఇక్కడ మ్యాచ్ గెలిచింది. అయితే గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. 193 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో చూద్దాం.
భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ లార్డ్స్ టెస్ట్‌లో పూర్తిగా ఆడలేదు. మిగతా మ్యాచ్‌లో అదరగొట్టిన జైస్వాల్ ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో 8 బంతుల్లో కేవలం 13 పరుగులు చేశాడు. వేగంగా ఆడుతున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌కి ఔట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అసలు రన్ చేయకుండా యశస్వి ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్ బ్యాటింగ్ విషయంలో కాస్త తడబడ్డాడు. కరుణ్ తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులకే వికెట్ కోల్పోయాడు. అయితే ఈ లార్డ్స్‌లో భారత్ ఓటమికి ముఖ్య కారణం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు. ఇందులో కేఎల్ రాహుల్ తప్ప ఇంకా ఎవరూ కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు.
కెప్టెన్ గిల్ సెంచరీలతో గత మ్యాచ్‌లో అదరగొట్టగా ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 16 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. గిల్ దూకుడు మీ బ్యాటింగ్ చేసి ఉంటే భారత్ గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉండేవి. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు తీవ్ర ఒత్తిడికి గురైంది. 58 పరుగులకు 4 వికెట్లు పడ్డాయి. టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు పడిపోవడంతో టీమిండియా కాస్త ఒత్తిడికి గురైంది. లంచ్ బ్రేక్ కంటే ముందు టీమిండియా వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ కంటే ముందు మొదటి రోజు కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి ఔట్ అయ్యారు. ఇలా వీరు ఔట్ కావడంతో మ్యాచ్ ఓడిపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఆడినా ఫలితం లేకపోయింది. మ్యాచ్‌ను చివరి వరకు జడేజా తీసుకెళ్లి ఒంటరి పోరాటం చేసినా కూడా టీమిండియా లార్డ్స్‌లో ఓటమిపాలైంది.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Yashasvi Jaiswal : రెండు సిక్స్ లు కొడితే చాలు.. ఆ రికార్డు బద్ధలు కొట్టనున్న యశస్వి జైస్వాల్
-
IND vs ENG: మొదటి టెస్ట్‌లో భారత్ ఓటమి.. కారణాలివే!
-
IND vs ENG: 25 ఏళ్ల తర్వాత సెంచరీతో చరిత్ర సృష్టించిన పంత్!
-
ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
-
Teamindia: టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఫిక్స్ అయ్యేది ఆ రోజే!