IND vs ENG: 25 ఏళ్ల తర్వాత సెంచరీతో చరిత్ర సృష్టించిన పంత్!

IND vs ENG: ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ మ్యాచ్ జరుగుతోంది. హెడింగ్లీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఈ ఐదు టెస్ట్ సిరీస్‌లో భారత్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఎక్కువ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రెండు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి ఆసియా వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. మొత్తం క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సృష్టించిన రెండో వికెట్ కీపర్‌గా కూడా పంత్ నిలిచాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ మొదటి టెస్ట్‌లో రిషబ్ పంత్ ఈ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్‌లో 129 బంతులు చేసి సెంచరీలు చేశాడు. ఇలా రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే ఒక మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేశారు. జింబాబ్వే క్రికెటర్ ఆండీ ఫ్లవర్ 25 ఏళ్ల క్రితం ఈ రికార్డు సాధించాడు. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 2000లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగులతో ఆండీ ఫ్లవర్ ఈ విజయం సాధించాడు. మళ్లీ ఇప్పుడు రిషబ్ పంత్ ఈ రికార్డును సాధించాడు. అయితే పంత్‌కు ఇప్పుడు ఇది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. అయితే టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా కూడా ఇప్పటికే పంత్ రికార్డ్ సాధించాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. రాహుల్, పంత్ కలిసి మ్యాచ్‌ను ముందుకు నడిపించారు. అయితే ఈ మ్యాచ్‌లో రాహుల్ 87 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్‌తో పాటు పంత్ కూడా వారిదైన శైలిలో అదరగొడుతున్నారు. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జరిగిన మొదటి మ్యాచ్ ఇదే. వీరి లేకపోవడంతో టీమిండియా ఎలా ఆడుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారు లేకపోయినా గిల్ కెప్టెన్సీలో టీమిండియా బాగా ఆడుతోంది. ప్రతీ ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. తప్పకుండా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి.. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Ind Vs Eng 4th Test: టీమ్ లోకి అన్షుల్ కాంబోజ్.. భారత జట్టు ఇదే
-
England Vs India 4th Test: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్.. భారత్ కు కఠిన పరీక్ష
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
IND vs ENG Lords Test: జడేజా ఒంటరి పోరాటం వృథా.. లార్డ్స్‌లో భారత్ ఓటమికి కారణాలివే