IND vs ENG: మొదటి టెస్ట్‌లో భారత్ ఓటమి.. కారణాలివే!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో బాగానే ఆడిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. 5 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లు అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన చేసిన ఓడిపోయింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్.. బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లను చెమటలు పట్టించలేదు. భారత్ కొన్ని విషయాల్లో చేసిన తప్పుల వల్ల ఓటమి పాలైంది. శుభమాన్ కెప్టెన్సీలో ఆటగాళ్లు బాగానే ఆడుతున్నారని, అందరూ భావించారు. కానీ చివరకు భారత్ ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
భారత్ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఫీల్డింగ్‌లో ఉన్న లోపాలే. యశస్వి జైస్వాల్ ఓ క్యాచ్ వదిలి పెట్టడంతో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం టర్న్ అయ్యింది. బెన్ డకెట్ క్యాచ్‌లను రెండు ఇన్నింగ్స్‌లో కూడా జైస్వాల్ మిస్ చేశాడు. మ్యాచ్ స్టార్టింగ్‌లో బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌లను కూడా బుమ్రా, రిషబ్ పంత్‌లు వదిలేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అన్నే క్యాచ్‌లు వదిలేశారు. ఈ కారణంగానే తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. భారత బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్‌లో 430 పరగులు చేయగా, 471 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలింగ్ సరిగ్గా చేసి ఉంటే తప్పకుండా మ్యాచ్ గెలిచేవారు. ఆఖరికి స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కూడా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లు తీశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా కూడా రాణించలేకపోయారు. అయితే భారత్ బ్యాటర్లు కాస్త ఒత్తిడికి గురయ్యారు. ఓడిపోతామనే భయంతో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయారు. ఇది కూడా భారత్ ఓటమికి కారణం అని చెప్పవచ్చు. అందులోనూ వికెట్లు పడకపోవడంతో వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో ఇంగ్లాండ్‌కు విజయం వచ్చింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ మ్యాచ్ తర్వాత ఓటమికి గల కారణాలు తెలిపారు. ఎన్నో అవకాశాలను వదిలేశామని, క్యాచ్‌లు మిస్ చేసుకున్నామని, లోయర్ ఆర్డర్ నుంచి సరిగ్గా లేదని తెలిపారు. కానీ జట్టు అద్భుతంగా ఆడారని గిల్ అన్నారు. తొలి మ్యాచ్ ఓడిపోయినా కూడా తర్వాత మ్యాచ్‌లో టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.
ఇది కూడా చూడండి: WhatsApp : పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేశారా.. ఇలా చేస్తే మళ్లీ తిరిగి వస్తాయ్
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Ind Vs Eng 4th Test: టీమ్ లోకి అన్షుల్ కాంబోజ్.. భారత జట్టు ఇదే
-
England Vs India 4th Test: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్.. భారత్ కు కఠిన పరీక్ష