Sourav Ganguly: టెస్టుల్లో కుల్దీప్ ను తప్పించడంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్
Sourav Ganguly ఆఖరి రెండు రోజుల ఆటలో నాణ్యమైన స్పిన్నర్ ఉంటే ఉపయోగపడేవాడని గంగూలీ అన్నాడు.

Sourav Ganguly: టెస్టుల్లో కుల్దీప్ ను తప్పించడంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లార్డ్స్, మాంచెస్టర్ టెస్ట్ ల్లో కుల్దీప్ మ్యాజిక్ ను టీమిండియా మిస్ చేసుకొందని అన్నాడు. ఆఖరి రెండు రోజుల ఆటలో నాణ్యమైన స్పిన్నర్ ఉంటే ఉపయోగపడేవాడని గంగూలీ అన్నాడు. నాణ్యమైన స్పిన్ లేకుండా టెస్టు మ్యాచ్ లో నాలుగు అయిదు రోజుల ఆటలో జట్టును ఆలౌట్ చేయడం కష్టమవుతుంది.
మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ పరిస్థితి చూశాం. కఠినమైన,కాస్త బంతి తిరగే పిచ్ పై భారత్ బ్యాటర్లు బ్యాటింగ్ కొనసాగించారు. నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో ఇంగ్లాండ్ 20 వికెట్లు పడగొట్టలేకపోయింది. గిల్ అత్యుత్తమంగా ఆడుతున్నాడు. బాధ్యత అప్పగిస్తే ఫలితాలు అందిస్తారనడానికి గిల్ నిదర్శనం. ఈ సిరీస్ గిల్ గొప్పగా బ్యాటింగ్ చేశాడని గంగూలీ అన్నాడు.
Related News